OTT Movie : ఆడవాళ్ళ జోలికి వెళ్ళి, రాజ్యాలను పోగొట్టుకున్న రాజులు ఉన్నారు. వీటి గురించి పురాణాలలో, ఎన్నో కథలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రాజు ఒక డాన్సర్ ను ప్రేమించి, ఆమె ప్రేమను పొందలేక సన్యాసంలో కలిసిపోతాడు. ఈ మూవీ 1959 లోనే వచ్చింది. అప్పటి నుంచే లవ్ మీద బాగా ఫోకస్ చేశారు దర్శకులు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘ది ఇండియన్ టోంబ్’ (The Indian tomb). 1959లో విడుదలైన ఈ మూవీకి ఫ్రిట్జ్ లాంగ్ దర్శకత్వం వహించారు. ‘ది ఇండియన్ టోంబ్’ లో డెబ్రా పేగెట్, పాల్ హబ్స్చ్మిడ్, వాల్టర్ రేయర్, క్లాస్ హోల్మ్, వాలెరీ ఇంకిజినోఫ్ నటించారు. వెస్ట్ బెర్లిన్‌లోని స్పాండౌ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్లు హెల్ముట్ నెంట్‌విగ్, విల్లీ స్కాట్జ్ రూపొందించిన సెట్‌లలో ఇంటీరియర్స్ చిత్రీకరించబడ్డాయి. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఖరగ్పూర్ ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తుంటాడు. అయితే అతనికి అందులోనే నాట్యం చేసే దేవసేన అంటే చాలా ఇష్టం. రాజుకి నాట్యం కూడా ఇష్టం ఉండటంతో, దేవసేనని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఆమెను ఎలాగైనా పొందాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆమెను బలవంతం చేయకుండా, ఇష్టపూర్వకంగానే అనుభవించాలని అనుకుంటాడు. దేవసేన మాత్రం జాన్ అనే వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు దేవసేన జాన్ తో కలిసి బ్రతకాలని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇది తెలుసుకున్న రాజు వాళ్లను పట్టుకోమని సైనికులను పంపిస్తాడు. అలా ఈ జంట ఒక గృహ లోకి వెళ్తారు. దూరం నుంచి గమనించిన సైనికులు, వీళ్ళిద్దరిని బంధించి రాజ్యానికి తీసుకెళ్తారు. జాన్ ను బంధించి అతనిని వదలాలంటే, తనతో ఇష్టంగా గడపాలని ఆమెతో కండిషన్ పెడతాడు రాజు. ప్రియుడ్ని బ్రతికించుకోవడానికి, రాజుతో ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది దేవదేన.
దూరం నుంచి ఇది గమనిస్తున్న దేవసేన చెల్లెలు మాయ, ఆమెను ఎలాగైనా కాపాడాలని చూస్తుంది. మాయ తన భర్తతో కలసి జాన్ ను, అక్కడినుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. మళ్లీ అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది దేవసేన. అక్కడ ఉన్న బ్రాహ్మణులు, తనని బలవంతంగా అనుభవిస్తే కీడు జరుగుతుందని చెప్తారు. పెళ్లి చేసుకుంటే మీకు సమస్య ఉండదని చెప్పడంతో, దేవసేనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ ప్రాంతంలో తిరుగుబాటు దారులు రాజుని బంధిస్తారు. కొంతమంది సైనికులు ఈ తిరుగుబాటును అణిచివేసి రాజును కాపాడతారు. అప్పుడు కూడా దేవసేన పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎంత చేసినా దేవసేనని పొందలేకపోయానని, రాజు చివరికి సన్యాసం తీసుకుంటాడు. ఈ మూవీని చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో సిద్ధంగా ఉంది.