IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా… ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ( Mumbai Indians vs Kolkata Knight Riders ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్లను కట్టడి చేసింది ముంబై ఇండియన్స్. ఈ తరుణంలోనే… నిర్ణీత 20 ఓవర్స్ కూడా ఆడ లేక పోయింది కేకేఆర్.
Also Read: Rayudu on Rahul Dravid: వీల్ చైర్ పై ద్రావిడ్… అంబటి రాయుడు హాట్ కామెంట్స్ ?
16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) . కోల్కత్తా నైట్ రైడర్స్ టీం అంత తక్కువ పరుగులకు ఆల్ అవుట్ కావడానికి ముంబై కుర్రాడు కారణం. కొత్తగా వచ్చిన అశ్వని కుమార్ ( Ashwani Kumar )…. అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. మొత్తం మూడు ఓవర్లు వేసిన అశ్వని కుమార్ 24 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ కుప్పకూలింది.
ఎవరీ అశ్వని కుమార్?
ముంబై బౌలర్ అశ్వని కుమార్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. బౌన్సర్లతో పాటు మంచి యార్కర్లు వేయగల అరుదైన బౌలర్. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన టి20 ట్రోఫీలో అశ్వని కుమార్ బౌలింగ్ ప్రదర్శనకు… ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఫ్లాట్ అయిపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు అశ్వని కుమార్ ( Ashwani Kumar ). పంజాబ్ తరఫున 2022 సంవత్సరంలో దేశవాళి క్రికెట్ లో అడుగుపెట్టిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అద్భుతంగా ప్రదర్శన కనబరిచాడు. ఈ తరుణంలోనే.. 2025 మెగా వేలంలో అశ్విని కుమార్ ను ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) 30 లక్షల ధరకు కొనుగోలు.. చేసింది. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అశ్విని కుమార్ కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
Also Read: HCA – SRH: HCA-SRH పంచాయతీ…. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు !
కానీ ఇవాళ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) తరఫున ఆడిన నేపథ్యంలో బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు అశ్వని కుమార్ ( Ashwani Kumar ). ఇక ఇవాల్టి మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. డికాక్ ఒక పరుగు చేయ గా సునీల్ నరైన్ డక్ అవుట్ అయ్యాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే ( Ajinkya Rahane ) ఏడు బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రఘువంశీ 26 పరుగులు చేయక రింగు సింగ్ 17 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) మూడు పరుగులకే విఫలమయ్యాడు. అటు రసేల్ ఐదు పరుగులకు.. అవుట్ అయ్యాడు.