BigTV English

Virat Kohli : కోహ్లీ ఫైనల్ గెలిపిస్తాడు : కెప్టెన్ రోహిత్ శర్మ

Virat Kohli : కోహ్లీ ఫైనల్ గెలిపిస్తాడు : కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma Comments on SA vs IND Final Match : టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా ఘనంగా ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్ ను దెబ్బకు దెబ్బ కొట్టి, బదులు తీర్చి మరీ వెళ్లింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ సమష్టి కృషితో విజయం సాధ్యమైందని అన్నాడు. అలాగే ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని అన్నాడు. విరాట్ కోహ్లీ తప్పకుండా టచ్ లోకి వస్తాడు. ఫైనల్ గెలిపిస్తాడని అన్నాడు.


టీమ్ గా మేం చాలా కష్టపడ్డాం. పరిస్థితులకు త్వరగా అలవాటు పడ్డామని అన్నాడు. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా ఆడితే, గెలుపు సాధ్యమని నిరూపించామని అన్నాడు. ఒక దశలో 140-150 పరుగులే వస్తాయని భావించాను. అప్పుడు సూర్య, నేను దూకుడు పెంచాం. కనీసం 170 వస్తే చాలని అనుకున్నాను. దానిని హార్దిక్, అక్షర్, జడేజా సాధించారని తెలిపాడు. కులదీప్, అక్షర్ పటేల్ గన్ స్పిన్నర్లని అన్నాడు. ఒత్తిడిలోనూ ఎంతో నిశ్శబ్ధంగా ఉండి వికెట్లు తీయగలరని అన్నాడు.

Also Read : పదేళ్ల తర్వాత.. ఫైనల్ కి టీమ్ ఇండియా


బౌలింగుకి వచ్చేటప్పుడు స్టంప్ ఎటాక్ చేయాలని అనుకున్నాం. టీ 20 దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లండ్ చాలా స్ట్రాంగ్ టీమ్. అందుకనే కొంచెం జాగ్రత్తగానే ఉన్నాం. ఎక్కడా ఏమరపాటు ప్రదర్శించలేదని అన్నాడు.

అయితే విరాట్ కోహ్లీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చాడు. చాలామంది కొహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. తను గొప్ప క్లాస్ ప్లేయర్.. ఇబ్బంది పడుతున్నాడంతే. అదేం పెద్ద సమస్య కాదు. గొప్ప గొప్ప క్రికెటర్లందరూ కూడా తమ కెరీర్ లో ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నవారే.

15 ఏళ్లుగా తనతో ఆడుతున్నాను. ఎన్ని మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. అవింకా నాకు గుర్తున్నాయి. అతని ఆట తీరు అద్భుతం. ఫైనల్ లో కోహ్లీ మ్యాచ్ లో ఉంటాడు. అందులో సందేహమే లేదు. తప్పకుండా తను పైనల్ లో టచ్ లోకి వచ్చి, భారీ ఇన్నింగ్స్ ఆడతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు. మీరే చూడండి అని నమ్మకంతో చెప్పాడు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×