Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఆదివారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Delhi Capitals vs Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అవలీలగా మ్యాచ్ గెలిచింది. వరుస విజయాలను అందుకుంటున్న… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పీడ్ కు బ్రేకులు వేసింది బెంగళూరు ( RCB). అయితే ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది.
Also Read: Rishabh Pant : రిషభ్ పంత్ పై దారుణంగా ట్రోలింగ్.. నువ్వు ఎందుకు ఆడుతున్నావు అంటూ
రాహుల్ పై దూసుకు వెళ్లిన విరాట్ కోహ్లీ ( ViraKohli )
ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నిర్నిత 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో మొదట 3 వికెట్లు కోల్పోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును… విరాట్ కోహ్లీ అలాగే కృనాల్ పాండ్యా ఇద్దరు సెట్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ నేపథ్యంలోనే… విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయకముందు… కె ఎల్ రాహుల్ తో గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కె ఎల్ రాహుల్ తో ( Kl Rahul).. చాలా సీరియస్ గా మాట్లాడాడు బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Former Bangalore captain Virat Kohli ). దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విరాట్ కోహ్లీకి ఢిల్లీ సొంత గ్రౌండ్
విరాట్ కోహ్లీ అలాగే కేఎల్ రాహుల్ మధ్య జరిగిన సంఘటన వీడియో వైరల్ గా మారడంతో… క్రికెట్ అభిమానులు తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. తన సొంత గ్రౌండ్ ఢిల్లీ అని…. మీరేంటి ఓవర్ చేస్తున్నారు… అంటూ కే ఎల్ రాహుల్ ను విరాట్ కోహ్లీ బెదిరించాడని… అందుకే అతనితో గొడవ పెట్టుకున్నాడు అని కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఎక్కడ మ్యాచ్ ఆడిన ఇదే తంతు కొనసాగుతోందని మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో దారుణంగా విరాట్ కోహ్లీ స్పందించడానికి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీమిండియాలో ఎదుగుతున్న కేఎల్ రాహుల్ ని కూడా… కోహ్లీ బెదిరించాడని ఫైర్ అవుతున్నారు. ఇకనైనా విరాట్ కోహ్లీ బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు క్రికెట్ అభిమానులు. తోటి టీమిండియా క్రికెటర్లు, తనకంటే జూనియర్లను విరాట్ కోహ్లీ గౌరవించడం నేర్చుకోవాలని.. హెచ్చరిస్తున్నారు క్రికెటర్ ఫ్యాన్స్.
Also Read: Sarfaraz Khan – Ananya Bangar : గే తో సర్ఫరాజ్ ఖాన్ రిలేషన్… వీడియో వైరల్
Heated Conversation Between KL & Kohli pic.twitter.com/KxluLj61HR
— Popa 🇮🇳 (@MagnesiumKohli) April 27, 2025
Feel the difference : Chokli with Indian and Chokli with Pakistani player #DCvsRCB pic.twitter.com/nE16IPf9en
— ॐ🚩 (@Omii_07_Forever) April 27, 2025