BigTV English

Nani: మనల్ని ఎవడ్రా ఆపేది.. ‘హిట్ 3’ ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడేసిన నాని

Nani: మనల్ని ఎవడ్రా ఆపేది.. ‘హిట్ 3’ ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ డైలాగ్ వాడేసిన నాని

Nani: ఎప్పుడూ పక్కింటబ్బాయి పాత్రల్లో కనిపించే నాని.. ‘హిట్ 3’లో అర్జున్ సర్కార్ అంటూ మొదటిసారి ఒక వైలెంట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. కెరీర్‌లో కొత్త ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చేలా చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మామూలుగా తన సినిమాలను ప్రమోట్ చేయడం కోసం ఎప్పుడూ రొటీన్ డైలాగులే వాడతాడని నాని గురించి ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అందుకే ఈసారి రొటీన్ డైలాగులు ఏమీ చెప్పనంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ డైలాగ్‌ను ఉపయోగించాడు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ‘హిట్ 3’పై తన నమ్మకాన్ని బయటపెట్టాడు.


అదొక సెంటిమెంట్

‘‘నేను ప్రతీ సినిమాకు రాజమౌళి తన ఫ్యామిలీతో ఏ థియేటర్‌కు వెళ్తారో తెలుసుకొని అదే థియేటర్‌కు వెళ్లేవాడిని. సినిమా అయ్యాక ముందుగా వాళ్ల రివ్యూనే కనుక్కునేవాడిని. అలా నాకొక సెంటిమెంట్ ఉండిపోయింది. ఆ అలవాటుకు ఇప్పుడు బ్రేక్ పడింది. మేము సినిమాలు చూడడానికి అటు వైపు వెళ్లడం లేదు. మే 1కు మార్నింగ్ షో హిట్ 3 (Hit 3) చూసి రాజమౌళి మళ్లీ నాకు ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా తన ఫ్యామిలీలో ఒక వ్యక్తిని అని ఫీల్ అయ్యేలా చేసినందుకు రాజమౌళికి థాంక్యూ. ఆయనకు ఎన్ని పనులు ఉన్నా ఫోన్ చేసి పిలుస్తాను. ఇంతకు ముందే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి వచ్చారు’’ అంటూ రాజమౌళి గురించి చెప్పుకొచ్చాడు నాని (Nani).


గొడ్డుచాకిరీ చేయించాం

‘‘విశ్వక్ సేన్, అడవి శేష్ ఇద్దరూ హిట్ యూనివర్స్‌కు బలం. దానిని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం. శైలేష్‌ను నేను ముందు నుండి చూస్తున్నాను. తనలోని భయాలు, బలాలు, బలహీనతలు అన్నీ తెలుసు. తనలోని బాలన్ని తను ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. కానీ తన బలం తాలూకు ట్రైలర్‌ను మాత్రం హిట్ 3లో చూస్తారు. ఇప్పుడు శైలేష్ గురించి ఎక్కువగా చెప్తూ బిల్డప్ అనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్‌తో గొడ్డుచాకిరీ చేయించాం. మొన్ననే తనకు బాగా జ్వరం వస్తే తనను లేపి మరీ వర్క్ చేయించాం. శ్రీనిధితో నేను కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలకు హిట్ 3లో సగం లవ్ స్టోరీ ఉంటుందని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదు. మృదులా పాత్రలో తనను తప్పా వేరొకరిని ఊహించుకోలేం. స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంది’’ అని తెలిపాడు నాని.

Also Read: హీరోతో పాటు హీరోయిన్ ఫైట్ చేశారు.. ఇది విన్నారా

సెలబ్రేట్ చేసుకుందాం

‘‘మిగతా టీమ్‌లో రిలీజ్‌కు ముందే థాంక్యూ చెప్పుకోలేని పేర్లు కొన్ని ఉన్నాయి. బయట చాలా దారుణమైన విషయాలు వింటున్నాం. అందరి జీవితాల్లో సంతోషం ఉండాలి. తెలుగు వాళ్లకు బయటికి వెళ్లడానికి ముఖ్యమైన కారణం సినిమా. మే 1న సినిమాను మరోసారి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక థ్రిల్లర్, ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే హిట్ 3. ఈసారి రిలీజ్ ట్రైలర్‌తో పనిలేదు. హిట్ 3 బాగుండకపోతే అని చెప్పడానికి ఏ సినిమాను తాకట్టుపెట్టాలో అర్థం కావడం లేదు. హిట్ 3 వల్ల అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది’’ అంటూ ‘హిట్ 3’ పక్కా హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు నాని. చివరికి పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో తన స్పీచ్ ముగించాడు.

Tags

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×