Indian Cricketers: ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ముగిసింది. ఇక మరో ఐదు రోజులలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త సమయం దొరకడంతో గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం నుండి నేరుగా భారత క్రికెటర్లు వారి వారి ఇంటికి ప్రయాణమయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ముంబైలోని వారి వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు.
Also Read: Rajat Patidar RCB Captain: ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. RCB కొత్త కెప్టెన్ ఇతనే !
ఓ రెండు రోజులపాటు భార్యా పిల్లలతో సంతోషంగా గడిపి.. భారత ఆటగాళ్లు తిరిగి ఫిబ్రవరి 15న దుబాయ్ కి బయలుదేరుతారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మూడు రోజుల ముందే దుబాయ్ కి చేరుకోనున్నారు భారత ఆటగాళ్లు. ఈనెల 19వ తేదీ నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. ఇక గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎట్టకేలకు ఇంగ్లాండుతో జరిగిన వన్డేల్లో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. రెండవ వన్డేలో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తో చెలరేగాడు.
ఇక మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగబోయే ఐసిసి ఛాంపియన్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడబోతోంది భారత జట్టు. అనంతరం దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రోఫీలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు అన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇక మూడవ నెంబర్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ నాలుగవ స్థానంలో, ఐదవ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ ఇద్దరిలో ఎవరికో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చి.. మరొకరిని ప్లేయింగ్ 11 నుంచి తొలగించవచ్చు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరవ స్థానంలో బరిలోకి దిగుతాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ దిట్ట కావడంతో.. హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11 లో కచ్చితంగా ఉంటాడు.
Also Read: WPL 2025 schedule: రేపటి నుంచే WPL 2025 టోర్నీ..టైమింగ్స్, షెడ్యూల్ ఇదే..ఫ్రీగా చూడాలంటే ?
ఇక ఏడవ స్థానం నుంచి బౌలర్లు ఉంటారు. చెప్పింది విభాగంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.. ఇలా ఐదుగురిని తీసుకున్నారు. పేస్ బౌలర్లను తగ్గించి.. స్పిన్నర్లతో రాణించాలని భావిస్తోంది భారత జట్టు. ఇక ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేల్లో ఫామ్ లోకి వచ్చిన విరాట్, రోహిత్.. ఫుల్ ఫామ్ లో ఉన్న గిల్ అద్భుతంగా రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించవచ్చునని పేర్కొంటున్నారు నిపుణులు.
Virat Kohli , Shreyas Iyer and KL Rahul have returned home in Mumbai. pic.twitter.com/JQPBwVQxuW
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2025