Rajat Patidar RCB Captain: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సిబి} అభిమానులకు శుభవార్త చెప్పింది ఆ ఫ్రాంచైజీ. గత 17 ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సీజన్లలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సిబి.. ఈసారి కొత్త కెప్టెన్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ మొదలుకాగానే అన్ని మ్యాచ్ లలో మెరుపులు మెరిపిస్తూ.. లీగ్ పూర్తయ్యే సమయానికి ఈ జట్టు కప్ ని మాత్రం సాధించడం లేదు.
Also Read: WPL 2025 schedule: రేపటి నుంచే WPL 2025 టోర్నీ..టైమింగ్స్, షెడ్యూల్ ఇదే..ఫ్రీగా చూడాలంటే ?
విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఈ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఫాఫ్ డూప్లెసిస్ ని మెగా వేలంలో బయటకు వదిలేసిన తర్వాత ఆర్సిబికి కెప్టెన్ కొరత ఏర్పడింది. అయితే కెప్టెన్సీ రేసులో అనేకమంది ఆటగాళ్లు పోటీలో ఉన్నారని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సీఈవో రాజేష్ మీనన్ ఇటీవల తెలిపారు. అయితే తిరిగి విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా నియమిస్తారని అంతా భావించారు.
కానీ తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫ్రాంచైజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్ గా రజత్ పటీదార్ పేరును ప్రకటించింది ఆర్సిబి ఫ్రాంచైజీ. ఈ కొత్త కెప్టెన్ నాయకత్వంలోనైనా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కప్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. రజత్ పటిదార్ ని ఆర్సిబి కెప్టెన్ గా నియమిస్తున్నట్లు మేనేజ్మెంట్ అఫీషియల్ ప్రకటన చేసింది. ఇతడు 2021 నుండి ఆర్సిబి జట్టులో ఉన్నాడు. అంతేకాదు ఐపీఎల్ 2025 మెగా వేళానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకరు.
పటిదార్ తన కెరీర్ లో ఇప్పటివరకు 27 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 34.7 సగటుతో, 150 8.8 స్ట్రైక్ రేట్ తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, ఏడు అర్థ శతకాలు ఉన్నాయి. ఇతడికి ఇంతకుముందుకు ఓ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. 2024 – 2025 సమయంలో సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్ కి నాయకత్వం వహించాడు. ఆ సమయంలో మధ్యప్రదేశ్ జట్టుని ఫైనల్ కీ చేర్చాడు. అంతేకాకుండా 9 ఇన్నింగ్స్ లలో 428 పరుగులతో.. ఆ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
ఇక ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో 2009, 11, 16 సంవత్సరాలలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఫైనల్ వరకు చేరుకుంది. కానీ కప్ మాత్రం సాధించలేకపోయింది. మరి ఈసారి రజత్ పటిదార్ నాయకత్వంలోనైనా ఆర్సిబి జట్టు ట్రోఫీ సాధిస్తుందో..? లేదో..? వేచి చూడాలి.
Also Read: Ind Vs Eng 3rd Odi: 3-0 తేడాతో ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
RCB IPL 2025 జట్టు: విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), జితేష్ శర్మ (రూ. 11 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (రూ. 12.50 కోట్లు), సు. షర్య దర్మా (ఆర్. 6. 6. 2.60 కోట్లు), కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 10.75 కోట్లు), స్వప్నిల్ సింగ్ (రూ. 50 లక్షలు), టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు), రొమారియో షెపర్డ్ (రూ. 1.50 కోట్లు), నువాన్ తుషార (రూ. 1.60 కోట్లు), బెస్‌కో భ్‌వాజ్ (రూ. 1.60 కోట్లు), (రూ. 2.60 కోట్లు), దేవదత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు), స్వస్తిక్ చికారా (రూ. 30 లక్షలు), లుంగి ఎన్‌గిడి (రూ. 1 కోటి), అభినందన్ సింగ్ (రూ. 30 లక్షలు), మోహిత్ రాథీ (రూ. 30 లక్షలు).
The next captain of RCB is…
Many greats of the game have carved a rich captaincy heritage for RCB, and it’s now time for this focused, fearless and fierce competitor to lead us to glory! This calmness under pressure and ability to take on challenges, as he’s shown us in the… pic.twitter.com/rPY2AdG1p5
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025