Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి భారత్ నిష్క్రమించింది. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్-8లో చోటుదక్కించుకోలేక పోయారు. ఆసియా అండ్ ఓషియానియా ఖండం నుంచి టాప్-8 లోకి ఫిలిప్సీన్స్, థాయ్‌లాండ్ సుందరీమణులు ఎంపికయ్యారు.
మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. వివిధ దేశాల నుంచి ఈ పోటీలకు వచ్చిన పోటీదారులంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యటక ప్రాంతాలైన నాగార్జునసాగర్‌లోని బుద్ధిస్టు థీమ్ పార్క్, హైదరాబాద్‌లో చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలస్, ఓరుగల్లు కోట, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లో సందడి చేశారు. తెలంగాణ సచివాలయానికి కూడా వెళ్లారు. ఈ పోటీల నిర్వహణకు 27 కోట్ల దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టారంటున్నారు. ప్రతిపక్షాలు మాత్రం 200 కోట్ల దాకా అయ్యాయంటున్నాయి.
ఇప్పటి వరకు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడంలో ఇండియా, వెనిజులా అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్ నుంచి ఆరుగురు ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1966లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యా రాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ అయ్యారు. వెనిజులా కూడా ఆరుసార్లు కిరీటం గెలుచుకుని ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే ఐదుసార్లు, యూఎస్ఏ, సౌతాఫ్రికా చెరో మూడుసార్లు కిరీటం గెలిచాయి. తాజా పోటీలో ఎవరికి కిరిటం దక్కబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి భారత్ గెలిస్తే మిస్ వరల్డ్ ఎక్కువసార్లు గెలిచిన రికార్డు సొంతమవుతుంది.
కింద ఉన్న యూట్యూబ్ బటన్ నొక్కి లైవ్ చూడండి..