Siraj-Kohli : ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-2 తో సమానం అయింది. ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంటుందని చివరి వరకు అంతా అనుకున్నారు. నిన్న 35 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో మ్యాచ్ ని ముగించారు. అప్పటికీ 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ జట్టు ఇవాళ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ని విజయం వరించింది. మరోవైపు కొన్ని క్యాచ్ లు, ఫీల్డింగ్ లో కూడా పొరపాట్లు చేసింది టీమిండియా.. చివరికి మాత్రం 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. టీమిండియా విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానిక ఎగబాకింది.
సిరాజ్ పై ట్రోలింగ్స్
ఈ నేపథ్యంలోనే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా అభినందించాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ 2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడకపోవడంతో చాలామంది ట్రోల్ చేశారు. కానీ, ఇప్పుడు అవే మాటలు సిరాజ్ కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగిపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికీ ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయనంతరం మహ్మద్ సిరాజ్ చెప్పిన మాటలు ఇవి. ఆ సందర్భంగా సిరాజ్ ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడకపోవడంతో చాలామంది ట్రోల్ చేశారు.
సిరాజ్ పై కోహ్లీ ప్రశంసలు
కానీ ఇప్పుడు అవే మాటలు సిరాజ్ కు సరిపోతాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగిపోతుంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచలనం సృష్టించాడు. బుమ్రా పక్కన లేక పోయినప్పటికీ ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. ఓవల్ టెస్ట్ లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరాజ్ ప్రసిద్ద్ ల, దృఢ సంకల్పం వల్లే భారత్ కు ఈ అద్భుతమైన విజయం దక్కింది అని చెప్పవచ్చు. ఈ జట్టు కోసం ప్రతిసారి 100 శాతం ఎఫెక్ట్ పెట్టే సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడి పట్ల చాలా గర్వంగా ఉంది అని విరాట్ ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా, కోహ్లీ ట్వీట్ పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లై ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో బౌలర్ సిరాజ్ పై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా అభిమానులు.. హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే సిరాజ్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు. సిరాజ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి.. ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు.