IT employee viral: పుణేలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం ముందు ఓ యువకుడు రోడ్డుపై నిద్రిస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పైగా అతడి పక్కన కనిపించిన ఓ చేతిరాత లేఖ మరింత చర్చకు దారితీసింది. నా వద్ద డబ్బు లేదు. జీతం ఇవ్వడం లేదు. కాబట్టి ఫుట్‌పాత్ మీదే బతకాల్సిన పరిస్థితి అని ఆ లేఖలో వాపోయాడు.
ఈ యువకుడు పేరు సౌరభ్ మోర్. ఇతడు TCS పుణే సాహ్యాద్రి పార్క్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి. కానీ జీతం లేకపోవడం, తన ఐడీ యాక్టివేట్ కాకపోవడం వంటి అంశాలతో విసిగిపోయిన సౌరభ్ చివరకు ఆఫీస్ ముందు బహిరంగ నిరసనకే దిగాడు.
సొంత కంపెనీ ముందే ‘ఫుట్‌పాత్’ జీవితం
సాధారణంగా ఐటీ ఉద్యోగుల జీవితం గురించి విన్నప్పుడు ముందుగా దృష్టికి వచ్చే దృశ్యం.. స్వచ్చమైన గ్లాస్ బిల్డింగ్స్, ల్యాప్టాప్, ఎసి ఆఫీసులు. కానీ సౌరభ్ మోర్ కదిలించిన దృశ్యం అతి భిన్నం. అతని చేతిలో ఉన్న ప్లకార్డు.. నాకు డబ్బుల్లేవు, ఉద్యోగం ఇచ్చిన వాళ్లే జీతం ఇవ్వట్లేదన్న సందేశం అందరి మనసులను కలిచింది.
సౌరభ్ ఏంటంటే..
జులై 29, 2025న అతడు తిరిగి ఆఫీసుకు రిపోర్ట్ చేసినప్పటికీ, TCS యొక్క ఇంటర్నల్ సిస్టమ్ అయిన ‘ఉల్టిమాటిక్స్’లో అతని ఐడీ యాక్టివేట్ కాలేదు. దీంతో అతను అధికారికంగా పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇది HR విభాగానికి తెలపగా, తీర్చిదిద్దుతాం అనే భరోసా మాత్రమే లభించిందని అతడు పేర్కొన్నాడు. అయితే, జీతం మాత్రం వచ్చినట్టేం లేదు.
TCS స్పందన ఏంటి?
ఈ ఘటనపై స్పందించిన TCS కంపెనీ ప్రకటన ప్రకారం.. ఇది అథారిటీ లేకుండా గైర్హాజరైన ఉద్యోగి సమస్య. సంస్థ విధానాల ప్రకారం, ఎవరైనా అనధికారంగా గైర్హాజరవుతే జీతం నిలిపివేస్తాం. సౌరభ్ ఇప్పుడు తిరిగి రిపోర్ట్ చేశారు. అతనికి తాత్కాలిక నివాసం కల్పించాం. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది.
Also Read: Hyderabad tourism: హైదరాబాద్ కి హైవే కాదు.. రోప్‌వే వస్తోంది! ఎక్కడంటే?
పని – ప్రైవేట్ జీవితం మధ్య సమతుల్యత లేదు?
ఈ సంఘటన ఉద్యోగ భద్రత, మానవ విలువల మీద ప్రశ్నలు లేవనెత్తింది. ఒక పెద్ద ఐటీ సంస్థ ఉద్యోగిని అలా నిలదీయాల్సిన పరిస్థితి ఏ మేరకు న్యాయమనే చర్చ మొదలైంది. అతడు తప్పు చేసినా సరే, సహానుభూతితో వ్యవహరించాల్సిన బాధ్యత కంపెనీలదే కదా?
సోషల్ మీడియాలో వైరల్
సౌరభ్ మోర్ ఫోటోలు వైరల్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఒక ఐటీ ఉద్యోగి రోడ్డుపై పడుకోవడం అంటే.. మన దేశంలో ఉద్యోగ భద్రత పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పే ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇంతలో పరిష్కారం దొరికిందా?
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. సౌరభ్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. సంస్థ అతని సమస్యను పరిశీలించేందుకు ముందుకొచ్చింది. కానీ ఇది ఒక వ్యక్తిగత సంఘటన మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా లక్షల మంది ఐటీ ఉద్యోగుల పరిస్థితికి ప్రతిబింబంగా మారింది.
ఈ సంఘటనలో ఎటు చూసినా సత్యం ఒక్కటే.. ఉద్యోగి, సంస్థ మధ్య కమ్యూనికేషన్ లో లోపం ఉంటే.. అంతటి పెద్ద కంపెనీ ముందే ఓ ఉద్యోగి ఫుట్‌పాత్ మీద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తక్షణమే ఆలోచించాల్సిన సమయం.