BigTV English

Virat Kohli : సౌతాఫ్రికా గడ్డపై కొహ్లీ రికార్డ్..

Virat Kohli : సౌతాఫ్రికా గడ్డపై కొహ్లీ రికార్డ్..
Virat Kohli news today

Virat Kohli news today(Latest sports news telugu):

విరాట్ కొహ్లీ పేరు చెబితే చాల .. ఏ రికార్డులైనా సరే, దాసోహం అంటాయి. తను కొన్ని పరుగులు తీస్తే  చాలు, ఏదొక రికార్డు వెంటపడుతూనే ఉంటుంది. ఇప్పుడు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత్ బ్యాటర్ గా కొహ్లీ నిలిచాడు. ఇకపోతే డబ్ల్యూటీసీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 57 ఇన్నింగ్స్‌ ఆడి, 2101 పరుగులు చేశాడు.


అంతేకాదు ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. ఇంతవరకు నెంబర్ వన్ గా ఉండి, కొహ్లీ ధాటికి రెండో స్థానంలోకి వెళ్లిపోయాడు. తను 42 ఇన్నింగ్స్‌ల్లో 2097 పరుగులు చేశాడు. చతేశ్వర్ పుజారా(1769) మూడో స్థానంలో ఉన్నాడు. దీని తర్వాత మరో రికార్డ్ కూడా కొహ్లీ సొంతమైంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా విరాట్ నిలిచాడు. రికార్డులకెక్కాడు. తొలి టెస్ట్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.

ఇదే సమయంలో వరుసపెట్టి అందరినీ దాటుకుని కొహ్లీ ముందుకెళ్లిపోతున్నాడు. అలాగే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా కోహ్లీ వెనక్కి నెట్టేశాడు. సౌతాఫ్రికాతో 21 మ్యాచ్‌ల్లో ద్రవిడ్ 1252 రన్స్ చేశాడు.. కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 1268 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు.


ఇక ఈ జాబితాలో ఎప్పటిలాగే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.. వీరేంద్ర సెహ్వాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. 25 టెస్ట్‌ల్లో సచిన్ 1741 రన్స్ చేయగా, తసెహ్వాగ్ 1306 రన్స్ చేశాడు. మరో 38 పరుగులుగానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కొహ్లీ చేసేస్తే, ఈసారి సెహ్వాగ్ రికార్డును కూడా దాటేస్తాడు.

విరాట్ కొహ్లీ ఆడాలేగానీ, రికార్డులన్నీ వాటికవే పాదాక్రాంతం అవుతుంటాయని అభిమానులు అంటూ ఉంటారు. అంతేకాదు తను వరల్డ్ కప్ నుంచి బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నాడు. అన్ని మ్యాచ్ ల్లో విలువైన రన్స్ జోడిస్తున్నాడు. జట్టుకి తన సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అందుకు టీమ్ ఇండియా సాధించిన విజయాలే నిదర్శనం.

అందులో కొహ్లీ సాధించిన పరుగులు, అందించిన విజయాలు ఎనలేనివని చెప్పాలి. సౌతాఫ్రికాలో దీని తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్ కూడా ఉంది. ఈ రెండింటిలో కొహ్లీ సెంచరీలు చేసి సచిన్ రికార్డుకి చేరువ కావాలని కోరుకుందాం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×