BigTV English

Vijayakanth Biography : విజయ్‌కాంత్ బయోగ్రఫీ.. కెప్టెన్ గురించి తెల్సుకోవాల్సిన విషయాలివే..

Vijayakanth Biography : విజయ్‌కాంత్ బయోగ్రఫీ.. కెప్టెన్ గురించి తెల్సుకోవాల్సిన విషయాలివే..
Vijayakanth Biography

Vijayakanth Biography(Cinema news in telugu):

విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. విజయ్ కాంత్ అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. 1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టారు. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినీ కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్‌.. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు.


ఇక తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ తిరుగులేని విజయాన్ని అందించి.. స్టార్ హీరోగా చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. మొత్తంగా విజయ్ కాంత్ 154 సినిమాల్లో నటించగా.. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు.. ఆయనే దర్శకత్వం వహించారు. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు విజయ్ కాంత్.

27 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి విజయ్ కాంత్ ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో దూసుకుపోతూ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్‌లో విజయకాంత్‌ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించకపోవడం గమనార్హం. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్‌ అయి అక్కడ కూడా మంచి విజయాలు సాధించాయి. కోలీవుడ్‌లో తెరకెక్కిన తొలి 3డీ చిత్రం విజయకాంత్‌ నటించిన ‘అన్నై భూమి’ కావడం విశేషం.


కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా దేశ భక్తి, విప్లవాత్మక చిత్రాల్లో విజయ్ ఎక్కువగా నటించడంతో.. మొదట్లో ఆయన్ను ‘పురట్చి కలైంజ్ఞర్‌’ అనేవారు. ఒకవైపు రజనీకాంత్ తనదైన స్టైల్‌తో మాస్‌కు దగ్గరవ్వగా.. అటు కమల్‌హాసన్ విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న సమయంలో.. వాళ్లిద్దరికీ ధీటుగా మాస్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌కాంత్. పోలీస్ క్యారెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న విజయ్ కాంత్ దాదాపు 20 కి పైగా సినిమాల్లో పోలీస్ గా నటించారు.

ఇక కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా టాలెంట్ చూపించారు విజయ్ కాంత్. కాగా 1994 లో ఎంజీఆర్‌ పురస్కారాన్ని.. 2001లో కలైమళి అవార్డుని విజయ్ అందుకున్నారు. 2001లో బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు.. 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘హానరరీ డాక్టరేట్‌’ పొందారు. అలానే పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు కూడా అందుకున్నారు.

వెండితెరపై హీరోగా సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయాల్లో ప్రజాదరణ తగ్గినప్పటికీ ఇప్పటికీ కూడా పార్టీని కొనసాగిస్తూనే వస్తున్నారు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×