BigTV English

IND vs SL One Day Series : శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముగ్గురు దూరం

IND vs SL One Day Series : శ్రీలంకతో వన్డే సిరీస్ కు ముగ్గురు దూరం

IND vs SL One Day Series Matches : టీ 20 ప్రపంచకప్ గెలిచేశారు. సంబరాలు అయిపోయాయి. దీంతో వీరందరికి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. అలాగే జింబాబ్వే టూర్ కి గిల్ కెప్టెన్సీలో జూనియర్స్ ను పంపించింది. ఇప్పుడంతా బాగానే ఉంది. అయితే వచ్చే నెలలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. దానికి కూడా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు.


ఆల్రెడీ విరాట్, రోహిత్ అయితే టీ 20 సిరీస్ కి గుడ్ బై కూడా చెప్పేశారు. ఇప్పుడు వన్డేలకు కూడా గైర్హాజరవుతున్నారు. దీంతో నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. అయితే నెటిజన్లు కొందరు అనేమాటేమిటంటే వీళ్లు ఐపీఎల్ ని అలుపెరగకుండా ఆడారు. విపరీతంగా ప్రయాణాలు చేశారు. అదైన వెంటనే టీ 20 వరల్డ్ కప్ కోసం బయలుదేరారు. అక్కడ నెలరోజులు గడిచిపోయాయి. ఐపీఎల్ కి ముందు ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్, దక్షిణాఫ్రికా టూర్ జరిగింది. వీటన్నింటికన్నా ముందు వన్డే వరల్డ్ కప్ 2023 జరిగింది. ఇలా అలుపెరగని క్రికెట్ ఆడటం వల్లే, వీరు మరింత రెస్ట్ కోరుకుంటున్నారని సెలవు పెట్టిన క్రికెటర్లకు మద్దతు తెలుపుతున్నారు.

Also Read : ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?


అయితే త్వరలోనే న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అలాగే వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడాల్సి ఉంది. అందుకనే వీరు టెస్ట్ మ్యాచ్ లపై ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. మరోవైపు వీరి గైర్హాజరీలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కి కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటారని చెబుతున్నారు.

కొహ్లీ అయినా సెలవు తీసుకున్నాడుకానీ, కెప్టెన్ రోహిత్ కి అది కూడా లేదని అంటున్నారు. తనకిప్పుడు 37 ఏళ్లు వచ్చాయి. తనకి రికార్డ్స్ మీద కూడా పెద్ద నమ్మకం లేదని అంటున్నారు. ఇంకా కొహ్లీకి 100 సెంచరీలు చేయాలనే టార్గెట్ ఉంది. తనకి అది కూడా లేదని చెబుతున్నారు. ఇక బుమ్రా విషయానికి వస్తే, గత నాలుగేళ్లుగా జట్టు భారం మొత్తం తనే మోస్తున్నాడు. వచ్చేది టెస్ట్ సిరీస్ కాబట్టి, ఏకధాటిగా బౌలింగ్ చేయాలి. అందుకని తనకి రెస్ట్ మస్ట్ అంటున్నారు. మరి సీనియర్లు ఏం చేస్తారో చూడాలి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×