Vijay Devarakonda: మామూలుగా హీరో హీరోయిన్లు ఒకరినొకరు ఇష్టపడుతున్నా, డేటింగ్‌లో ఉన్నా దాని గురించి బయటికి చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. సీక్రెట్‌గానే తమ రిలేషన్‌షిప్‌ను నడిపిస్తారు. వారు అధికారికంగా ప్రకటించకపోయినా ఏదో ఒక విధంగా వారి ప్రేమ విషయం బయటికి వస్తుంది. అలాగే ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా హాట్ టాపిక్‌గా ఉన్న ప్రేమజంట విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందనా (Rashmika Mandanna). వీరి ప్రేమ గురించి వీరెప్పుడూ ఓపెన్‌గా చెప్పలేదు. కానీ ఎన్నో హింట్స్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. తాజాగా అలా వీరిద్దరూ బయట కలిసి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో విజయ్ మరోసారి బుక్కయ్యాడు అంటూ ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
ఎప్పటినుండో రూమర్స్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గీతా గోవిందం’ సినిమాలో మొదటిసారి కలిసి నటించారు విజయ్ దేవరకొండ, రష్మిక. ఆ సినిమాలోనే వీరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వెంటనే ‘డియర్ కామ్రేడ్’ కోసం మరోసారి చేతులు కలిపారు. ఇక అప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్స్ మొదలయిపోయాయి. ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరూ కలిసి మరొక మూవీ చేయలేదు. అయినా కూడా వీరి లవ్ గరించి రూమర్స్ మాత్రం ఆగలేదు. ఇండస్ట్రీలో కూడా చాలామంది విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. అప్పుడప్పుడు వీరిద్దరూ కూడా ఇలా కలిసి కనిపిస్తూ ఆ రూమర్స్ నిజమేనేమో అనిపించేలా చేస్తున్నారు.
Also Read: పెళ్లి ముహూర్తం పిక్స్.. త్వరలో ఏడడుగులు వేయనున్న మిల్క్ బ్యూటీ..!
బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ
విజయ్ దేవరకొండ, రష్మిక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే వీరి సీక్రెట్ రిలేషన్‌షిప్ గురించి అర్థమయిపోతుంది. ఏ స్పెషల్ సందర్భం వచ్చినా సెపరేట్‌గా ఫోటోలు దిగి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది ఈ జంట. ఆ ఫోటోల్లో వీరిద్దరూ కలిసి ఉండకపోయినా బ్యాక్‌గ్రౌండ్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. ఇక తాజాగా ఏకంగా వీరిద్దరూ ఒకే రెస్టారెంట్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించారు. ఎవరో వీరిద్దరినీ ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటో గంటల్లోనే తెగ వైరల్ అయ్యింది. ఇప్పటికైనా వీరిద్దరి ప్రేమ గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రిలేషన్‌షిప్‌లో ఉన్నాను
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నాడు. దానికోసమే పూర్తిగా తన లుక్ మార్చేశాడు. ఇక రష్మిక మందనా అయితే పూర్తిగా పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ రిలీజ్, ప్రమోషన్స్ విషయంలో తను బిజీగా గడిపేస్తుంది. ఇలా ఇద్దరి బిజీ షెడ్యూల్స్ మధ్య వారికి కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సమయం కుదరగా అప్పుడే వారి ఫోటో లీక్ అయ్యింది. ఇక సినిమాల మధ్యలో ఇటీవల ఒక హిందీ ఆల్బమ్ సాంగ్‌లో నటించి మెప్పించాడు విజయ్. ఆ సాంగ్ ప్రమోషన్స్ సమయంలో తను రిలేషన్‌లో ఉన్నానని, ఒక హీరోయిన్‌ను డేట్ చేశానని ఓపెన్‌గా చెప్పేశాడు.
Malli dorikaru….🤦🤦 #VijayDevarakonda – #RashmikaMandanna pic.twitter.com/Ur3Xf6eaz7
— Up To Date (@piyush890052871) November 23, 2024