IND vs Aus 1st test: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో… మన భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో చలికెలపడిన… టీమిండియా బ్యాటర్లు… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ సెంచరీ తో చెలరేగిపోయాడు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో… సెంచరీ చేసి తన సత్తా చాటాడు విరాట్ కోహ్లీ.
కేవలం 143 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. ఇక ఈ సెంచరీలో 8 ఫోర్లు అలాగే రెండు సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ కెరీర్ లో ఇది 30వ సెంచరీ కావడం గమనార్హం. ఇక విరాట్ కోహ్లీ సెంచరీ కాగానే… డిక్లేర్ చేశారు. 487 పరుగులకు ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా… రెండు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
దీంతో 534 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది టీమిండియా. ఇక అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 161 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అటు కేయాల రాహుల్ 77 పరుగులు చేసి… రాణించాడు. కాగా ఇవాల్టి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. తాజాగా విరాట్ కోహ్లీ కొడుకు ఆకాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అనుష్క శర్మ… తన కుటుంబంతో పెర్త్ స్టేడియానికి వచ్చింది.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కుమారుడు ఫోటోలు లీక్ అయ్యాయి. అనుష్క శర్మ పక్కన ఎవరో ఒక వ్యక్తి విరాట్ కోహ్లీ కొడుకును ఎత్తుకొని ఉన్నారు. అయితే… మ్యాచ్ కు సంబంధించిన కెమెరాలలో విరాట్ కోహ్లీ కొడుకు ముఖం స్పష్టంగా కనిపించింది. ఆ ఫోటోలలో అచ్చం విరాట్ కోహ్లీ లాగానే అతని కొడుకు ఉన్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: IPL Auction 2025: రేపే వేలం.. అందరికన్ను ఈ వికెట్ కీపర్లపైనే.. పంత్ పై కోట్ల వర్షం గ్యారెంటీ?