Virender Sehwag: టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక A జట్ల మధ్య ప్రస్తుతం ట్రై సిరీస్ ( Tri Nation A Series in Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంక వేదికగా ఈ టోర్నమెంట్ జూన్ 9వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన శ్రీలంక అలాగే టీమిండియా లిస్టు ఏ ( Ind A Vs SL A Tri Series Final) జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయింది. అయితే ఆదివారం అంటే జూన్ 21వ తేదీన శ్రీలంక వర్సెస్ టీమిండియా ఏ జట్ల మధ్య ట్రై సిరీస్ ఫైనల్ ఉండనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం స్టేడియం (Rangiri Dambulla International Stadium, Dambulla) వేదికగా జరగనుంది. రేపు ఉదయం 10 సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ట్రై సిరీస్ లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka A vs India A, Final) మధ్య లిస్ట్ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న అనవసరంగా వైభవ్ సూర్యవంశీని గెలికారని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పుడు ఫైనల్స్ లో అనుభవిస్తారని హెచ్చరించారు. ఈ రెండు జట్ల మధ్య రేపు ఫైనల్ జరగనుండగా… వైభవ్ భయంకరంగా బ్యాటింగ్ చేస్తాడని హెచ్చరించారు. రేపటి మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ డబుల్ సెంచరీ చేసిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. లంక ప్లేయర్లు అనవసరంగా గెలికి… ఇప్పుడు తన్నించుకుంటారని చురకలు అంటించారు. పడుకున్న సింహాన్ని.. శ్రీలంక క్రికెటర్లు అనవసరంగా లేపారని… ఆదివారం దాని పంజా పవర్ చవిచూస్తారని హెచ్చరించారు.
మొన్న గ్రూప్ స్టేజ్ లో శ్రీలంక వర్సెస్ టీమిండియా A జట్ల మధ్య మొన్న మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సూపర్ ఓవర్ ( Super Over) దాకా మ్యాచ్ వెళ్లగా… లంక విజయం సాధించింది. అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న వైభవ్ ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్లు అనవసరంగా గెలికారు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్ ( Vaibhav).. శ్రీలంక క్రికెటర్ల కాలర్లు పట్టుకున్నాడు. దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గొడవ పెద్దదిగా మారింది. అయితే అంతలోనే అంపైర్లు కలగజేసుకొని.. గొడవను చల్లార్చారు. ఈ సంఘటనలో లంక ప్లేయర్లతో పాటు వైభవ్ పై ఐసీసీ యాక్షన్ తీసుకుంది. భారీ ఫైన్ విధించింది.