Shahid Afridi: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ సేన చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో టి20 సిరీస్ ( India tour of England, 2026) కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో గెలిచిన ఇంగ్లాండ్…3-0 తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ఓటమిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) హేళన చేస్తూ మాట్లాడారు. ఐపీఎల్ టోర్నమెంట్లో ఇరగదీసిన టీమిండియా క్రికెటర్లు… ఇంగ్లాండ్ గడ్డపై అత్యంత దారుణంగా ఆడుతున్నారని విమర్శలు చేశారు. సిక్సర్లు కాదు కనీసం సింగిల్ తీసేందుకు కూడా టీమిండియా ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారని చురకలు అంటించారు. త్వరలోనే పాకిస్తాన్ చేతిలో కూడా ఓడిపోయేందుకు టీమిండియా సిద్ధంగా ఉండాలని సెటైర్లు పేల్చారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ చేతిలో వరుసగా మూడు టి20 లు ఓడిపోయిన టీమ్ ఇండియా పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ జట్టులో గొప్ప కెప్టెన్ ఉన్నాడని నిత్యం చెప్పుకునే టీమిండియా పరిస్థితి ఇప్పుడు రోడ్డున పడిందని చురకలు అంటించారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా… ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోనూ సిరీస్ కోల్పోయింది… భవిష్యత్తులో పాకిస్తాన్ చేతిలో కూడా ఓడిపోతుందని హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో తయారుచేసిన మైదానాలలో అలవాటు పడ్డ, టీమిండియా క్రికెటర్లు ఇంగ్లాండులో మాత్రం విఫలమవుతున్నారని చురకలు వంటించారు. టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ గెలిచిన ఛాంపియన్లే… ఇంగ్లాండ్ చేతిలో తోక ముడుస్తున్నారని సెటైర్లు పేల్చారు. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియా పతనం మొదలైందని ఎద్దేవా చేశారు. ఇంగ్లాండ్ లాంటి జట్లతో అసలు టీమిండియా కనీసం పోటీ ఇవ్వలేకపోతుందని హేళన చేశారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన టీమిండియా.. పాకిస్తాన్ చేతిలో కూడా ఓడిపోతుందని అంచనా వేశారు షాహిద్ అఫ్రిది. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టును టీమిండియా దారుణంగా ఓడించింది… ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదని జోస్యం చెప్పారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ చేతిలో దెబ్బతిన్న టీమిండియా, ఇప్పుడే కోలుకునే పరిస్థితి లేదని తెలిపారు. వాళ్ల హిందూ దేవుళ్ళు దిగివచ్చిన కూడా టీం ఇండియాను కాపాడడం కష్టమేనన్నారు. ఇకపై పాకిస్తాన్ తో ఏ మ్యాచ్ జరిగిన టీమిండియా ఓడిపోతుందని హెచ్చరించారు.