E-Paper

గిల్లితే గిల్లించుకోవాలి కానీ, అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్

గిల్లితే గిల్లించుకోవాలి కానీ, అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్
Advertisement

Wasim Jaffer on Vaibhav Sooryavanshi:  ట్రై సిరీస్ లో భాగంగా మొన్న శ్రీలంక (Sri Lanka A) వర్సెస్ టీమ్ ఇండియా లిస్ట్ ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ తరుణంలో శ్రీలంక క్రికెటర్లతో వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi) గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట శ్రీలంక క్రికెటర్లు.. వైభవ్ సూర్యవంశీని గెలికారు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్, లంక గడ్డపై ఆ దేశానికి చెందిన క్రికెటర్ల కాలర్లు పట్టుకున్నాడు. హీరో రేంజ్ లో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అటు ఐసీసీ, బీసీసీఐ కూడా వైభవ్ పై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్య వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer). గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదంటూ వైభ‌వ్ ను హెచ్చ‌రించారు. రెచ్చ‌గొడితే, రెచ్చిపోకుండా… బ్యాట్ ద్వారానే స‌మాధానం చెప్పాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read:  Kamran Akmal Slams Pakistan Womens Team : బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్

Advertisement

శ్రీలంక క్రికెటర్లతో వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi)  గొడవ పడ్డ సంఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ (Wasim Jaffer) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా వాళ్లతో గొడవ పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రస్తుతం వైభవ్ రేంజ్ అంతా ఇంత కాదు… వరల్డ్ క్లాస్ ప్లేయర్ కు స్టేటస్ సంపాదించుకున్నాడని గుర్తు చేశారు జాఫర్. ఇలాంటి క్రమంలో చాలా మంది వైభవ్ సూర్యవంశీని రెచ్చగొడుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. అనవసరంగా రెచ్చిపోతే, ఇలాంటి సంఘటనలు జరుగుతాయని హెచ్చరించారు. గిల్లితే గిల్లించుకోవాలి… కానీ ఎదురు తిరగకూడదని వార్నింగ్ ఇచ్చారు.

చేతుల‌తో కాదు, బ్యాట్ స‌మాధానం చెప్పు

చాలా ఓర్పుగా మ్యాచ్ ఆడితే, బాగుంటుందన్నారు. ఎవరైనా గెలికితే, బ్యాట్ తో తప్ప.. చేతులతో సమాధానం ఇవ్వకూడదని హెచ్చరించారు. మొన్న జరిగిన సంఘటనలో వైభవ్ సూర్యవంశీ తప్పేం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రీలంక ప్లేయర్లది 200% తప్పు ఉందని వెల్లడించారు. అయినప్పటికీ వైభవ్ ఓపిక పడితే బాగుండున్నారు. తప్పు లేకున్నా నిత్యం వార్తల్లో వైభవ్ పేరు వస్తోందని వివరించారు. అలా నిత్యం వార్తల్లో నిలిస్తే ఏమాత్రం బాగుండదని తెలిపారు. ఇకపై వైభవ్ కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అన్నారు. దీంతో వైభవ్ సూర్య వంశీ పై  ( Vaibhav Sooryavanshi)  వసీం జాఫర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Javed Miandad Vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

 

 

Related News

ఇషాన్‌ కిషన్‌కు వీసా వ‌చ్చేసింది…వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత‌డు త‌ప్పుకోవాల్సిందే !

ఫాతిమా సనాకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ‘ది హండ్రెడ్ 2026’ లోకి వైల్డ్‌కార్డ్

Tanveer Ahmed : నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

గిల్ పెద్ద సెల్ఫీష్‌..వాడి వల్లే డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయింది !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?

Big Stories

×