BigTV English

Ben Stokes Comments on Ind Vs Eng 2nd Test: బుమ్రా వల్లే ఓటమి పాలయ్యాం.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్..!

Ben Stokes Comments on Ind Vs Eng 2nd Test: బుమ్రా వల్లే ఓటమి పాలయ్యాం.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్..!
Sports news in telugu

Ben Stokes Comments on England Lost in 2nd Test Match: రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం టీమ్ ఇండియా పేసర్ బుమ్రా అని కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. మ్యాచ్ అనంతరం ఓటమికి కారణాలను తనదైన శైలిలో వివరించాడు. నిజానికి మొదటి, రెండు రోజులు కూడా బ్యాటింగ్ కి పిచ్ అనుకూలంగా ఉంది. మేం కూడా బాగానే చేయగలమని అనుకున్నాం. కానీ తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా అడ్డం పడి, మమ్మల్ని తక్కువ స్కోరుకి అవుట్ చేశాడని అన్నాడు.


సరే, జరిగిందేదో జరిగింది, రెండో ఇన్నింగ్స్ లో కూడా 399 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించగలమని నమ్మాం. అక్కడ కూడా మూడు వికెట్లు తీసి అడ్డు పడ్డాడని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ లో ఆసాంతం బ్రహ్మాండంగా బౌలింగ్ చేసిన బుమ్రాని అభినందించాడు. ఓడితే ఓడాం, కానీ ఒక మంచి మ్యాచ్ లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నాడు.

అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేటప్పుడు ఇలాంటి సవాళ్లు వస్తూనే ఉంటాయి. ఇలాంటివెన్నో చూసి వచ్చాం. అందుకని ఏదో జరిగిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నాడు. ఆటలో ఒత్తిడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిలోని అసలైన ఆటగాడు బయటపడతాడు, అత్యుత్తమమైన ఆట బయటకు వస్తుందని అన్నాడు.

మేం వాళ్లని ఒత్తిడిలోకి నెట్టడం కాదు, ఈసారి టీమ్ ఇండియా రివర్స్ లో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టిందని అన్నాడు. ఇదే థియరీతో మొదటి మ్యాచ్ లో విజయం సాధించాం. కానీ దురదృష్టవశాత్తు రెండో టెస్టులో ఓటమి పాలయ్యామని అన్నాడు.


ఏ కెప్టెన్ కు ఎవరూ ఇలా ఆడాలి, అలా ఆడాలని చెప్పరు. ఎందుకంటే గ్రౌండులోకి వెళ్లాక, బయట చెప్పినట్టు ఉండదని అన్నాడు. ఆ సమయానికి ఫీల్డ్ లో కెప్టెన్ గా తీసుకునే నిర్ణయం, ఇక ఆడేటప్పుడు మన మైండ్ ఇచ్చే డైరక్షన్ ను బట్టి కొట్టే షాట్ ఇవే కీలకమని అన్నాడు.

టార్గెట్ 330 దాటనివ్వకూడదని అనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. మా దగ్గర కూడా స్పిన్నర్లు కొత్తవారే ముగ్గురున్నారు. వీరితో ఛాలెంజ్ గానే గేమ్ ఆడాలని అన్నాడు. మా జట్టులో కూడా నెంబర్ వన్ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారని అన్నాడు. మూడో టెస్ట్ కి మరింత కట్టుదిట్టమైన వ్యూహాలతో బరిలోకి దిగుతామని అన్నాడు.

Related News

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Murli vijay : ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విజయ్ సీక్రెట్ రిలేషన్.. సముద్రాలు దాటి!

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Big Stories

×