BigTV English

Survey on CM Jagan Governance: జగన్ పాలనపై సర్వే.. ప్రజల అభిప్రాయం ఇదే..

Survey on CM Jagan Governance: జగన్ పాలనపై సర్వే.. ప్రజల అభిప్రాయం ఇదే..
Andhra Pradesh Survey

Survey on CM Jagan Governance(Andhra politics news): మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్ జనంలో తిరిగారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ స్క్రీములే మళ్లీ అధికారం అందిస్తామని వైసీపీ నేతలు భావిస్తున్నారు.


సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏపీ అస్తవ్యస్తంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శానాస్త్రాలు సంధిస్తున్నాయి. 3 రాజధానుల ప్రకటనతో మూడుముక్కలాట ఆడుతున్నారని మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అంటున్నాయి. ఏపీ ప్రగతిలో వెనుక్కు పరుగు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అంటున్నాయి. దాడులు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని మదనపడుతున్నాయి. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శిస్తున్నాయి. మద్యం ఏరులై పారుతోందనేది ప్రతిపక్షాల మాట.

ఏపీలోని అనేక అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణకు రేషనల్ సాంప్లింగ్ టెక్నిక్ పద్ధతి ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.


1)ఏపీలో మద్యం ధరలు, మద్యం లభ్యత, నాణ్యత, సరఫరాపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 5 శాతం B) బాగుంది : 5 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగోలేదు : 30 శాతం E) అస్సలు బాగోలేదు : 50 శాతం

ఈ అంశంపై 2024 జనవరి 1 నుంచి జనవరి 20 మధ్య సర్వే చేపట్టారు. 15 మంది సిబ్బంది 3 వేల మంది నుంచి అభిప్రాయం తీసుకున్నారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.

2) రోడ్లు, వంతెనలు, కాలువలు లాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం, విస్తరణ, నిర్వహణ, మరమ్మతులపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 5 శాతం B) బాగుంది : 10 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగాలేదు : 25 శాతం E) అస్సలు బాగోలేదు : 50%

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే చేపట్టారు. 25 మంది సిబ్బంది 9 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే సాగింది.

3) సంక్షేమ పథకాలు.. లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ విధానంపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 25 శాతం B) బాగుంది : 40 శాతం C) పర్వాలేదు : 15 శాతం, D) బాగోలేదు : 10 శాతం, E) అస్సలు బాగాలేదు : 10 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే జరిగింది. 10 మంది సిబ్బంది 6 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. 18 పార్లమెంట్ నియోజకవర్గాలు, 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సర్వే నిర్వహించారు.

4) యువతకు ఉపాధి , ఉద్యోగ కల్పన, పారిశ్రామికాభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 5 శాతం B) బాగుంది : 15 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగాలేదు : 30 శాతం E) అస్సలు బాగాలేదు : 40 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే జరిగింది. 25 మంది సర్వే సిబ్బంది 9 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. 21 పార్లమెంట్ నియోజకవర్గాలు, 50 అసెంబ్లీ స్థానాల్లో సర్వే నిర్వహించారు.

5) విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, విద్యుత్ కోతలు నివారణ, విద్యుత్ ధరలపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 10 శాతం B) బాగుంది : 10 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగాలేదు : 25 శాతం E) అస్సలు బాగాలేదు : 55 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే చేపట్టారు. 25 మంది సిబ్బంది 6 వేల శాంపిల్స్ తీసుకున్నారు. 8 పార్లమెంట్ స్థానాలు, 20 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది.

6) ప్రజారవాణా, ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్ల నిర్వహణ, ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, టికెట్ ధరలు నియంత్రణపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 25 శాతం B) బాగుంది : 15 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగాలేదు : 20 శాతం E) అస్సలు బాగాలేదు : 30 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే నిర్వహించారు. 10 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో 3 వేల మందిని అభిప్రాయం అడిగారు. 8 పార్లమెంట్ నియోజకవర్గాలు, 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు.

7) ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, పిల్లలకు కల్పించే సదుపాయాలు మధ్యాహ్నభోజనం తదితర అంశాలపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 35 శాతం B) బాగుంది : 25 శాతం C) పర్వాలేదు : 20 శాతం D) బాగాలేదు : 15 శాతం E) అస్సలు బాగాలేదు : 5 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే జరిగింది. 25 మంది సర్వే సిబ్బంది 6 వేల శాంపిల్స్ సేకరించారు. 20 పార్లమెంట్ స్థానాలు, 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.

8) ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, అంబులెన్స్ లు, ఆరోగ్య శ్రీసేవలపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 20 శాతం B) బాగుంది : 20 శాతం C) పర్వాలేదు : 15 శాతం D) బాగాలేదు : 20 శాతం E) అస్సలు బాగోలేదు : 25 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే చేపట్టారు. 15 మంది సర్వే సిబ్బంది 3 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయం సేకరించారు. 8 పార్లమెంట్ స్థానాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు.

9) నగరాలు, పట్టణాలు, పంచాయతీలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్, మురికి కాలువలు, పార్కులు, రోడ్ల నిర్వహణ, పన్నుల అంశాల్లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 10 శాతం B) బాగుంది : 10 శాతం C) పర్వాలేదు : 20 శాతం D) బాగాలేదు : 20 శాతం E) అస్సలు బాగాలేదు : 40 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. 15 మంది సిబ్బంది 6 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించారు.
12 పార్లమెంట్ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ సర్వే జరిగింది.

10) రాష్ట్రంలో రైతులకు ఎరువుల సరఫరా, సాగునీరు, విద్యుత్, ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధర చెల్లింపులపై మీ అభిప్రాయం ఏంటి ?
A) చాలా బాగుంది : 15 శాతం B) బాగుంది : 20 శాతం C) పర్వాలేదు : 10 శాతం D) బాగాలేదు : 25 శాతం E) అస్సలు బాగాలేదు : 30 శాతం

ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య సర్వే చేపట్టారు. 15 మంది సిబ్బంది 12 వేల మంది ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. 22 పార్లమెంట్ స్థానాలు, 55 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఈ సర్వే నిర్వహించారు.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×