E-Paper
Advertisement

Tushar Deshpande Engagement : సీఎస్‌కేలో పెళ్లి సందడి.. స్కూల్ క్రష్‌తో తుషార్ ఎంగేజ్‌మెంట్..

Tushar Deshpande Engagement : సీఎస్‌కేలో పెళ్లి సందడి.. స్కూల్ క్రష్‌తో తుషార్ ఎంగేజ్‌మెంట్..
Advertisement

Tushar Deshpande Engagement : క్రికెటర్లలో పెళ్లి సందడి మొదలయ్యింది. ఐపీఎల్ అయిపోయిన వెంటనే ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే సీఎస్‌కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్.. ఒక క్రికెటర్‌ను పెళ్లి చేసుకున్నాడు. రుతురాజ్ తర్వాత ఇప్పుడు మరొక చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండే పెళ్లికి సిద్దమయ్యాడు. తుషార్.. ఇటీవల తన స్కూల్ క్రష్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్.. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ట్రాఫీని గెలిచి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. తుషార్ దేశ్‌పాండే ఈ టీమ్‌లో ముందు నుండి తన పర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుస్తూ వస్తున్నాడు. తాజాగా ముంబాయిలో తన స్కూల్ క్రష్ నభా గద్ధంమ్వార్‌తో తుషార్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. వారి ఫోటోలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెటర్స్ అందరూ ఈ కపుల్‌కు తమ విషెస్‌ను తెలియజేస్తున్నారు. ఇద్దరూ క్రికెట్ బాల్‌తో చేసిన ఫోటోషూట్.. నెటిజన్లు సైతం ఆకర్షించింది.

Advertisement

యంగ్ బౌలర్‌గా మంచి గుర్తింపు అందుకున్న తుషార్.. ముందుగా ముంబాయ్ ఇండియన్స్ టీమ్‌తో కలిసి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సీఎస్‌కే టీమ్ తనను సొంతం చేసుకుంది. ముందుగా తన పర్ఫార్మెన్స్‌ను అందరూ ప్రశంసించకపోయినా.. మెల్లగా తనను తాను ఆటలో మెరుగుపరుస్తూ ముందుకెళ్లాడు. ఐపీఎల్ 2023లో 6వ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తుషార్ గుర్తింపును అందుకున్నాడు. అంతే కాకుండా సీఎస్‌కే 4వ టైటిల్ గెలుచుకున్న సమయంలో తుషార్ పాత్ర కీలకంగా ఉంది.

తుషార్ తన ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘తను స్కూల్ క్రష్ నుండి నా కాబోయే భార్యలాగా ప్రమోట్ అయ్యింది’ అని నభాతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కొద్ది సమయంలోనే ఈ పోస్ట్‌కు విపరీతంగా లైక్‌లు వచ్చిపడ్డాయి. ప్రముఖ క్రికెటర్లు చాలామంది కంగ్రాట్స్ తుషాంత్ అంటూ ఈ పోస్ట్‌కు కామెంట్స్ కూడా పెట్టారు. ఐపీఎల్‌లో తనకు స్నేహితుడిగా ఉన్న శివమ్ దూబే ఈ ఎంగేజ్‌మెంట్‌కు అటెండ్ అయినట్టు తెలుస్తోంది.

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

సచిన్ వికెట్ తీయాలంటే.. ఆ దేవుడిని పూజించాల్సిందే..బ్రెట్ లీ కామెంట్స్ వైరల్

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

Big Stories

Advertisement
×