Asia Cup 2025 : ఆసియా కప్ 2025 ప్రస్తుతం సూపర్ 4 దశలో మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ల్లో భాగంగా ఇప్పటికే శ్రీలంక జట్టు ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు జట్ల చేతిలో ఓటమి పాలయ్యాయి. ఇక ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. ఇప్పటికే టీమిండియా ఫైనల్ కి అర్హత సాధించింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సంజు శాంసన్ కి బ్యాటింగ్ కి దించకపోవడం పై పలు విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ కి ముందు అతను చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Pak vs Ban: ఇవాళే బంగ్లా వర్సెస్ పాక్ మ్యాచ్…గెలిస్తే ఫైనల్స్, ఓడితే ఇంటికే
మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్, సంజు శాంసన్‌ను ఉద్దేశించి, “మీరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణించారు. మరి ఇప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఎందుకు ఆడుతున్నారు?” అని ప్రశ్నించారు. దీనికి శాంసన్ మాట్లాడుతూ.. క్రీడలో తన సొంత ప్రయాణాన్ని స్టార్ హీరో మోహన్‌లాల్ తో పోల్చుకున్నారు. “40 ఏళ్లుగా నటిస్తున్న మోహన్‌లాల్ కు ఇటీవలే అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. నేనూ పదేళ్లుగా దేశం తరుపున ఆడుతున్నా.. అన్ని సార్లు హీరో పాత్రనే చేస్తానంటే కుదరదు. విలన్, జోకర్ పాత్రాలు కూడా చేయాల్సి ఉంటుంది. జట్టు కోసం నేను ఏ పాత్రలోనైనా ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఓపెనర్‌గా రాణించాను. కాబట్టి అక్కడే ఆడతాను అని చెప్పడం సరికాదు. నేను మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించాలనుకుంటున్నాను. జట్టుకు అవసరమైనప్పుడు నేను ఏ పాత్రలోనైనా రాణించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. తన పేరు సంజూ మోహన్‌లాల్ శాంసన్” అని తెలిపారు. సంజు చేసిన ఈ పోలికకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
మరోవైపు ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ చేరింది. బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 168 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. 4 పరుగుల వద్దనే బుమ్రా ఓపెనర్ హాసన్ తనిమ్ వెనక్కి పంపించాడు. మరో ఓపెనర్ సైఫ్ హాసన్ పోరాడినప్పటికీ భారత బౌలర్లు మిగతా బ్యాటర్లను పెద్దగా పరుగులు చేయకుండా కట్టడి చేశారు. దీంతో సైఫ్ హాసన్ (69) పోరాటం వృధా అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా2, వరుణ్2, అక్షర్ పటేల్ 1, తిలక్ వర్మ 1 చొప్పున వికెట్లను తీశారు. దీంతో బంగ్లాదేశ్ 127 పరుగులు మాత్రమే చేసి 19.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఇక ఆసియాకప్ 2025లో శ్రీలంక ఇంటి బాట పట్టింది. నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా గెలవడంతో ఆ జట్టు ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది.
India deciding batting order today pic.twitter.com/QQL30itK6U
— Out Of Context Cricket (@GemsOfCricket) September 24, 2025