BigTV English

Gautam Gambhir: టీమ్ ఇండియా.. ఓటమికి కారణాలేమిటి? గంభీర్ కు.. బీసీసీఐ ప్రశ్నలు

Gautam Gambhir: టీమ్ ఇండియా.. ఓటమికి కారణాలేమిటి?  గంభీర్ కు.. బీసీసీఐ ప్రశ్నలు

What Were BCCI 3 Big Questions Asked To Gautam Gambhir During Interview: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ పేరు దాదాపు ఖరారైపోయింది. ఎందుకంటే కోల్ కతా నైట్ రైడర్స్ ని గెలిపించడమే అందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా కోల్ కతా జట్టుని ప్రక్షాళన చేయడం, అసలు సోదిలోనే లేని జట్టుని వెలుగులోకి తీసుకురావడం, గెలిచేలా ప్రణాళికలు రచించడం, అన్నిటికి మించి కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను పట్టుకుని, ముందుకు నడిపించడం బీసీసీఐకి నచ్చిందని అంటున్నారు.


నిజానికి క్రికెట్ లో గౌతం గంభీర్ కి గట్టి బుర్రే ఉందని అంతా అంటుంటారు. ఈ క్రమంలో టీమ్ ఇండియాకి హెడ్ కోచ్ గా వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరిగిపోయాయి. కాకపోతే రొటీన్ గా జరగాల్సిన తంతు జరుగుతోంది. ఈ క్రమంలో గౌతం గంభీర్ తో బీసీసీఐ వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది. సుమారు 40 నిమిషాల సేపు ఇది జరిగింది. బీసీసీఐ కమిటీ సభ్యులు తనని మూడు ప్రశ్నలు వేసినట్టుగా చెబుతున్నారు.

మొదటి ప్రశ్న: టీమ్ ఇండియా ఐసీసీ మెగా టోర్నమెంట్లు గెలవలేక గత పదేళ్లుగా  వైఫల్యం చెందుతోంది. మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. అయినా ఫలితం ఉండటం లేదు. అన్నింటికి మించి వర్క్ లోడ్ ఫీలవుతున్నారు. దీని నుంచి ఎలా బయటపడాలి? మీ దగ్గర ఉన్న ప్లాన్లు ఏమిటి?


రెండో ప్రశ్న: టీమ్ లో కోచింగ్ సిబ్బంది అనేవారు ఎలా ఉండాలి?  మీకున్న ఆలోచనలు ఏమిటి?

Also Read: ఆఫ్గాన్ తో యుద్ధానికి రెడీ.. నేడే టీమ్ ఇండియా తొలి సూపర్ 8 మ్యాచ్

మూడో ప్రశ్న: బ్యాటింగ్, బౌలింగు విభాగాల్లో కొందరు సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పుడు.. జట్టులో మార్పులు-చేర్పులు చేయాలి. అంతేకాదు, వారిని ఒకొక్కసారి పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చినప్పుడు మీరెలా హ్యాండిల్ చేస్తారు?

ఈ విషయాలను ఒక క్రీడా ఛానెల్ తన కథనంలో వెల్లడించింది. వాటికి గంభీర్ ఏం సమాధానాలు చెప్పాడనేది తెలీదు. అయితే తనకి పోటీగా మాత్రం డబ్ల్యూవిరామన్ కూడా ఉన్నాడు. గంభీర్ తర్వాత బీసీసీఐ తనని ఇంటర్వ్యూ చేసింది. తను కూడా ఒక ప్రత్యేకమైన  ప్రణాళికతో వచ్చి ఇంట్రస్టింగ్ గా చెప్పాడని అంటున్నారు. అయితే బీసీసీఐకి మాత్రం గౌతం గంభీర్ పైనే ఇంట్రస్టు ఉందని అంటున్నారు. ప్రస్తుతానికి ఒక రౌండ్ పూర్తయ్యింది. రెండో రౌండ్ కాగానే బీసీసీఐ వెంటనే కొత్త కోచ్ ని ప్రకటిస్తుందని అంటున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×