BigTV English

Vat Savitri Purnima: వట్ సావిత్రి పూర్ణిమ రోజున ఈ తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది జాగ్రత్త

Vat Savitri Purnima: వట్ సావిత్రి పూర్ణిమ రోజున ఈ తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుంది జాగ్రత్త
Advertisement

Vat Savitri Purnima: హిందూ మతంలో వ్రతాలు, పూజలు, ఏకాదశి, పూర్ణమి వంటి ప్రత్యేక రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వ్రతాల్లో ముఖ్యమైన వట్ ​​సావిత్రి వ్రతానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసం సంవత్సరానికి రెండుసార్లు ఆచరిస్తారు. మొదటి వట్ సావిత్రి వ్రతం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున, రెండవది జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి రోజున ఆచరిస్తారు. ఈ సంవత్సరం వట్ సావిత్రి పూర్ణిమ జూన్ 21 న అంటే రేపు జరుపుకోనున్నారు. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.


వాట్ సావిత్రి ఎప్పుడు

పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 21 ఉదయం 07:31 గంటలకు ప్రారంభమై జూన్ 22 ఉదయం 06:37 గంటలకు ముగుస్తుంది. వట్ సావిత్రి వ్రతాన్ని అభిజీత్ ముహూర్తంలో మొదలుపెడతారు. అది జూన్ 21న వస్తుంది కాబట్టి, వట్ సావిత్రి పూర్ణిమ వ్రతం 21 జూన్ 2024, శుక్రవారం నాడు ఆచరిస్తారు.


పూజ సమయం

వట్ సావిత్రి పూర్ణిమ నాడు పూజకు 3 పవిత్రమైన సమయాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం, ఉదయం 7.08 నుండి 8.53 వరకు ఉంటుంది. రెండవ ముహూర్తం ఉదయం 8:53 నుండి 10:38 వరకు, మూడవ పూజ ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 02:07 వరకు ఉంటుంది.

పూజా విధానం

వట్ సావిత్రి ఉపవాసం రోజున ఉదయాన్నే స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. తర్వాత మర్రి చెట్టుకు పూజ చేయాలి. ఇందుకోసం ముందుగా మర్రిచెట్టుకు నీటికి సమర్పించాలి. అనంతరం పూలు, ధాన్యాలు, బెల్లం, నానబెట్టిన శెనగలు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. మర్రి చెట్టు చుట్టూ దారాన్ని చుట్టి 7 సార్లు ప్రదక్షిణ చేయండి. పూజ చేసిన అంనతరం వట్ సావిత్రి వ్రతం కథను విని, ఆపై నమస్కరించండి. తోచినంత మేరకు విరాళాలు ఇచ్చినా కూడా పుణ్యం లభిస్తుంది.

ఏమి చేయకూడదు

వట్ సావిత్రి పూర్ణిమ వ్రతం రోజున భార్యాభర్తలు మాంసాహారం, మద్యం సేవించకూడదు. మహిళలు నలుపు, గోధుమ, నీలం రంగుల దుస్తులను ధరించకూడదు. ఎవరినీ దుర్భాషలాడకండి.

ప్రాముఖ్యత

వట్ సావిత్రి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆమె తపస్సు వల్ల సత్యవతి తన భర్త సత్యవానుడి జీవితాన్ని పొందింది. అప్పటి నుండి భర్త దీర్ఘాయుష్షు కోసం ఈ ఉపవాసం పాటిస్తారు. దీనివల్ల వైవాహిక సుఖం, శ్రేయస్సు కూడా కలుగుతుంది.

Tags

Related News

Diwali Vastu Tips: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Dhanteras 2025: ధన త్రయోదశి నాడు ఈ సమయంలో బంగారం కొంటే.. కుబేరులవుతారు

Diwali 2025: దీపావళి రోజు.. లక్ష్మీ దేవిని పూజించే సరైన పద్ధతి ఏంటో తెలుసా ?

Diwali 2025: దీపావళి రోజు ఇంటికి ఇవి కొని తెస్తే .. అష్టైశ్వర్యాలు కలుగుతాయ్

Wakeup at Night: రాత్రి ఆ సమయంలో నిద్రలేస్తున్నారా.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

Big Stories

×