BigTV English

CM Chandrababu Naidu : అమరావతిలో సీఎం చంద్రబాబు.. ప్రజావేదిక శిథిలాల పరిశీలన

CM Chandrababu Naidu : అమరావతిలో సీఎం చంద్రబాబు.. ప్రజావేదిక శిథిలాల పరిశీలన
Advertisement

CM Chandrababu Naidu Visits Amaravati : పోలవరం తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్యంసాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ముందుగా.. కూల్చిన ప్రజావేదిక ప్రాంగణాన్ని వీక్షించారు. చంద్రబాబునాయుడు ఆ ప్రాంతానికి వెళ్లగానే.. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. జగన్ ప్రభుత్వ విధ్యంస పాలనకు సాక్షిగా ఈ శిథిలాలను అలాగే ఉంచుతామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.


తర్వాత ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మోకాళ్లపై కూర్చొని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి నమస్కరించారు. అక్కడి నుంచి హోమం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

Also Read : జగన్ పథకాలకు పేర్లు మార్పు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..


మహిళా రైతులు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. హారతులతో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఫౌండేషన్ స్టోన్‌కు కొబ్బరి కాయ కొట్టారు చంద్రబాబు. ఆ తర్వాత అమరావతి నమూనాను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలను పరిశీలించారు. 2019లోనే ఈ భవనాల నిర్మాణం 70 నుంచి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం రాగానే.. అమరావతి అటకెక్కింది. నిర్మాణ పనులను నిలిపివేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబునాయుడు స్థానికులతో అన్నారు.

 

 

Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×