BigTV English

Harish Shankar: బాలీవుడ్ స్టార్ హీరోతో హరీష్ శంకర్.. ఇది దేనికి రీమేకో.?

Harish Shankar: బాలీవుడ్ స్టార్ హీరోతో హరీష్ శంకర్.. ఇది దేనికి రీమేకో.?

Harish Shankar: ఈరోజుల్లో చాలావరకు బాలీవుడ్ హీరోలంతా సౌత్ దర్శకులపైనే ఫోకస్ పెట్టారు. సౌత్ దర్శకులను గుడ్డిగా నమ్ముతున్న బాలీవుడ్ స్టార్లు ఎందరో ఉన్నారు. యంగ్ హీరోలకంటే ఎక్కువగా సీనియర్ హీరోలే సౌత్ దర్శకులను నమ్ముతున్నారు. అందుకే ఇక్కడ దర్శకులు కూడా అక్కడి హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా డెబ్యూ ఇచ్చారు. కొందరు అయితే అక్కడే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ఫుల్ సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయారు కూడా. అలాంటి వారిలో హరీష్ శంకర్ కూడా యాడ్ అవ్వనున్నాడు. అసలు ఈ దర్శకుడు ఏ బాలీవుడ్ స్టార్‌తో సినిమా ప్లాన్ చేశాడో తెలుసా.?


బాలీవుడ్‌లో అడుగు

ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి డాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు హరీష్ శంకర్. దర్శకుడిగా హరీష్ శంకర్ సినిమాలు మాత్రమే కాదు.. ఒక వ్యక్తిగా తన యాటిట్యూడ్ కూడా చాలామందికి ఇష్టం. అందుకే తన ఫ్యాన్ బేస్ ఎక్కువ. తాజాగా హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. అలాగే తన అప్‌కమింగ్ మూవీ అప్డేట్ ఏదైనా ఇస్తే బాగుంటుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. ఆ మూవీ నుండి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. కానీ తను ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే విషయం తాజాగా బయటికొచ్చింది.


భాయ్‌తో సినిమా

టాలీవుడ్‌లో ఇప్పటికే హరీష్ శంకర్‌కు దర్శకుడిగా మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్‌లో కూడా అదే రేంజ్‌లో తన టాలెంట్ చూపించాలని సిద్ధమయ్యాడట ఈ దర్శకుడు. అందుకే బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సల్మాన్ ఖాన్‌తో సినిమా ప్లాన్ చేశాడట హరీష్ శంకర్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఏదో ఒక యంగ్ హీరోతో తన అప్‌కమింగ్ మూవీ ప్లాన్ చేసుకున్నాడట హరీష్ శంకర్. కానీ ఎందుకో మళ్లీ తన దృష్టి సల్లూ భాయ్‌పై పడిందని, ఈ కాంబో దాదాపుగా కన్ఫర్మ్ అని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో కూడా ప్లాన్ చేస్తున్నారట. అందుకే దీనిని నిర్మించడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగనుంది.

Also Read: కౌంట్‌డౌన్.. ఒకటి.. పుష్ప రాజ్‌ను దాటలేకపోయిన పెద్ది

అన్నీ రీమేక్సే

ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ రైటర్‌గా ఉన్న హరీష్ శంకర్ (Harish Shankar).. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘షాక్’తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ అనే మూవీ చేశాడు. కానీ అది బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన ‘దబాంగ్’కు రీమేక్. అలా రీమేక్స్ వరల్డ్‌లోకి ఎంటర్ అయ్యాడు ఈ దర్శకుడు. వరుసగా రీమేక్స్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్నాళ్ల పాటు ఈ ఫార్ములా సక్సెస్ అయినా ఇప్పుడు అవ్వడం లేదు. అందుకే ‘రెయిడ్’ రీమేక్‌గా హరీష్ శంకర్ తెరకెక్కించిన చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా అనగానే ఇది ఏ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నాడో అని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×