E-Paper
Advertisement

Manu Bhaker: తొలి పతకం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Manu Bhaker: తొలి పతకం సాధించిన మను భాకర్ ఎవరు? ఆమె గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Advertisement

Paris Olympics 2024: ప్యారిస్‌లో జరుగుతున్న ఒలిపింక్స్ క్రీడల్లో భారత బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో తొలి పతకం ఖాతాలో వేసుకుంది. హర్యానాకు చెందిన మను భాకర్ ఈ పతకాన్ని సాధించింది. ఈ ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని సాధించడమే కాదు.. షూటింగ్ కేటగిరీలో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగానూ మను భాకర్ రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు షూటింగ్‌లో భారత మహిళా క్రీడాకారిణి మెడల్ సాధించలేదు.

హర్యానా మన దేశానికి అత్యుత్తమ క్రీడాకారులను అందించింది. మంచి బాక్సర్లు, రెజ్లర్లను ఈ రాష్ట్రం తయారు చేసింది. కానీ, మను భాకర్ మాత్రం ఇందుకు భిన్నంగా షూటింగ్ ఎంచుకుని తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుంది. మను భాకర్ కూడా నేరుగా షూటింగ్‌లోకి రాలేదు. అంతకు ముందు టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ క్రీడలను స్కూల్‌లోనే ఆడింది. మార్షల్ ఆర్ట్స్‌లోనూ దూసుకుపోయింది. కానీ, ఆ తర్వాత ఆమె అభిరుచి షూటింగ్ వైపు మళ్లింది. చిన్న వయసులోనే ఆమె ప్రొఫెషనల్ షూటర్‌గా ఎదగాలని నిర్ణయించుకుంది.

Advertisement

2016 రియో ఒలింపిక్స్ ముగియగానే 14 ఏళ్ల మను.. షూటింగ్‌ను ఎంచుకుంది. అప్పటికే చాలా రకాల స్పోర్ట్స్ రుచి చూసిన ఆమె స్వల్ప వ్యవధిలోనే షూటింగ్‌లో ఎక్కువ మక్కువ పెంచుకుంది. వారం గడిచేలోపే తన తండ్రిని స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కావాలని అడిగింది. తాను స్పోర్ట్ ప్రొఫెషనల్లీగా తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. మను స్పోర్ట్ జర్నీలో ఇప్పటి వరకు తోడుగా సాగుతున్న తండ్రి అందుకు వెంటనే అంగీకరించాడు.

Also Read: ఒలింపిక్స్ దుస్తులు నాసిరకంగా ఉన్నాయి: గుత్తా జ్వాలా

Advertisement

మను టీనేజ్ వయసు నుంచే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తున్నారు. 2017లో నేషనల్ షూటింగ్ చాంపియన్షిప్‌లో.. ఒలింపియన్, మాజీ వరల్డ్ నెంబర్ 1 హీనా సిద్దును ఓడించి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకున్నారు. 2017 ఏషియన్ జూనియర్ చాంపియన్షిప్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 2018 ఆమె తన వరల్డ్ లెవెల్ ఎంట్రీని ప్రకటించింది. ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్ కప్‌లో పాల్గొని క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వరల్డ్ రికార్డులు తిరగరాసింది. 16 ఏళ్ల వయసులో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో ఆమె తన విజయపరంపరను కొనసాగిస్తూనే వచ్చింది.

టోక్యోలనే తొలిసారి అర్హత సాధించిన ఆమె తప్పకుండా మెడల్ సాధిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, పిస్టల్‌లో సాంకేతిక లోపంతో మెడల్ చేజారింది. కానీ, ఈ సారి ఆమె గురి తప్పలేదు. కాంస్య పతకాన్ని సాధించింది. భవిష్యత్‌లో మరిన్ని ఒలింపిక్స్ పతకాలు ఆమె సాధిస్తుందన్న ఆశలు మాత్రం పెరిగాయి.

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×