BigTV English

Harish Shankar: మరి సురేశ్ కొండేటితో ఎందుకు సారీ చెప్పించలేదు.. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫైర్

Harish Shankar: మరి సురేశ్ కొండేటితో ఎందుకు సారీ చెప్పించలేదు.. డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫైర్

Suresh Kondeti: మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సుమ, సురేశ్ కొండేటీల వివాదం కూడా చర్చకు వచ్చింది. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్లకు ఎందుకు అంతలా రియాక్ట్ అవుతారు? అంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్‌ను ఓ జర్నలిస్టు అడిగాడు. ఇందుకు చాలా సింపుల్‌గా ఎమోషన్స్ అందరికీ ఉంటాయి కదండీ అంటూ సమాధానం చెప్పాడు హరీశ్ శంకర్. ఈ సమాధానం చెబుతూ సుమ వివాదాన్ని గుర్తు చేశారు.


‘స్నాక్స్ తినడాన్ని భోజనం చేస్తున్నారని సుమ అన్నందుకు మీరంతా హర్ట్ అయ్యారు. ఎమోషన్స్ అందరికీ కామన్. ట్విట్టర్‌లో బూతులు తిడతారు. పేరెంట్స్‌ను ట్యాగ్ చేసి చెత్త కామెంట్లు చేస్తారు. మీకు అర్థమైందనుకుంటా.. ’ అంటూ హరీశ్ శంకర్ సదరు జర్నలిస్టును ఉద్దేశిస్తూ మాట్లాడారు. ‘మరొక విషయం.. సుమ ఎన్నో ఈవెంట్లతో బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఒకే రోజు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పొరపాటున ఒక మాట దొర్లి ఉండొచ్చు. ఆడియన్స్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో ఆ మాట రావొచ్చు. సరే అది పొరపాటే. మీరు ఆమెతో సారీ కూడా చెప్పించారు. ఆమె పొరపాటుకు మీరు సారీ చెప్పాడు. ఇక్కడి వరకు ఓకే. కానీ, సురేశ్ కొండేటి పరిస్థితి ఏమిటీ? మిమ్మల్ని అన్నందుకు ఒక అమ్మాయితో సారీ చెప్పించారు. కానీ, మహిళను కొశ్చన్ చేసిన సురేశ్ కొండేటితో ఎందుకు మీరు సారీ చెప్పించలేదు? ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు. కానీ, ఆడిపిల్లను అన్నప్పుడు సురేశ్ కొండేటితో సారీ చెప్పించాలి కదా?’ అంటూ హరీశ్ శంకర్ నిలదీశారు. దీనికి కొందరు తాము సురేశ్ కొండేటితోనూ సారీ చెప్పించామని అన్నారు.

Also Read: ఒలింపిక్స్ దుస్తులు నాసిరకంగా ఉన్నాయి: గుత్తా జ్వాలా


మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్‌ల కలయికలో మిస్టర్ బచ్చన్ సినిమా వస్తున్నది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే నెల 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఇందులోనూ హరీశ్ శంకర్.. జర్నలిస్టుల తీరుపై ప్రశ్నలు వేశారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×