BigTV English

T20 world cup 2024 : వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి? టీ 20 వరల్డ్ కప్ టీమ్ లో ఎవరుంటారు?

T20 world cup 2024 : వీరీ వీరీ గుమ్మడి పండు వీరి పేరేమి? టీ 20 వరల్డ్ కప్ టీమ్ లో ఎవరుంటారు?

T20 world cup 2024 : ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ లో ఏ స్థానంలో ఎవరుంటారనేది పెద్ద పజిల్ గా మారింది. సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు వీరుంటారంటే, వీరుంటారని చెబుతున్నారు. అయితే గ్రౌండ్ లో ఆడేది మాత్రం చివరికి 11 మంది మాత్రమే. కానీ అందులో ఎవరుంటారనేది టీమ్ మేనేజ్మెంట్ కి పెద్ద తలనొప్పిగానే ఉంది. ముఖ్యంగా సీనియర్లకి కూడా అర్థం కాని కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అవేమిటంటే…


ముఖ్యంగా ఓపెనర్లు ఇద్దరిలో ఒకరు రోహిత్ శర్మ అయితే పక్కా, మరి రెండో పక్క ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. వీరిలో  శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే చోటుంది. గిల్ ప్రతిభను ఏదో నాలుగు మ్యాచ్ లు చూసి తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే తను ఆల్రడీ నిరూపించుకున్నాడు.

నిరూపించుకోవాల్సింది యశస్వి జైస్వాల్ మాత్రమే. తను ఒకటి బాగా ఆడితే, రెండింట చేతులెత్తేస్తున్నాడు. అయినా సరే పదేపదే అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు టీమ్ మేనేజ్మెంట్ పై వినిపిస్తున్నాయి. ఇకపోతే రుతురాజ్ గైక్వాడ్ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇది అతనికి అడ్వాంటేజ్. కానీ గిల్ తో పోల్చుకుంటే వెనుకడుగులోనే ఉన్నాడు.


ఇకపోతే ఫస్ట్ డౌన్ విరాట్ కొహ్లీ ఉన్నాడు. దానినెవరూ మార్చలేరు. సెకండ్ డౌన్ కి వచ్చేసరికి మళ్లీ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు శ్రేయాస్ అయ్యర్, మరొకరు సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ వరుసగా విఫలమవుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ టీ 20 స్పెషలిస్ట్ కాబట్టి తనని కాదనలేరు. థర్డ్ డౌన్ కి వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఉన్నాడు.

ఆల్రడీ కేఎల్ రాహుల్ ని ఆఫ్గనిస్తాన్ తో టూర్ లో తీసుకోలేదు కాబట్టి, ఓపెనర్లుగా ఉన్న గిల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ కి ఇక్కడ అవకాశాలున్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ క్రీజులో సెట్ కావడానికి కొన్ని బాల్స్ తీసుకుంటున్నాడు. అది టీ 20లో కుదరదు. అందువల్ల ఈ స్థానంలోకి వారు రావచ్చు. లేదంటే తిలక్ వర్మకి కూడా అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నారు. బహుశా ఈ స్థానం తను భర్తీ చేస్తాడని భావిస్తూ ఉండవచ్చు.

తర్వాత ఐదో స్థానం బెర్త్ రింకూ సింగ్ కి పక్కాగా కన్ ఫర్మ్ అయిపోయినట్టే. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పరోక్షంగా చెప్పారు. అందులో సందేహం లేదు.

ఇక ఆరోస్థానం ఆల్ రౌండర్ ది.. గాయం మాని హార్దిక్ పాండ్యా వస్తే, ఆ ప్లేస్ తనదే. లేదంటే శివమ్ దుబె రెడీగా ఉన్నాడు. ఒకవేళ ప్రత్యామ్నాయ బౌలర్ గా కొన్ని వనరులు కావాలంటే ఇద్దరు ఆల్ రౌండర్లను తీసుకోవచ్చు. తర్వాత ఏడో స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడు. ఇక అక్కడ నుంచి టెయిల్ ఎండర్స్ వస్తారు.
ఇదీ సీక్వెన్స్..

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×