Champagne Bottle: అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీతో టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టులో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ పలికిన తరుణంలో.. గిల్ నాయకత్వంలోని టీమిండియా ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో..? అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. కానీ అతడు తాజాగా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గాను అందరికీ ఒక నమ్మకాన్ని కలిగించాడు.
Also Read: FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఇంగ్లాండ్ గడ్డపై మొట్టమొదటిసారి కెప్టెన్ గా అడుగుపెట్టిన గిల్.. ఈ సిరీస్ లో ఐదు టెస్టుల్లో మొత్తంగా 754 పరుగులు చేసి, ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్ లో మొత్తంగా నాలుగు సెంచరీలు చేశాడు. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో ఏకంగా 269, 161 పరుగుల చొప్పున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫైటింగ్ స్పిరిట్ తో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడూ మైదానంలో కూల్ గా ఉండే గిల్.. ఈ సిరీస్ లో కొన్ని కీలక సమయాలలో చురుకైన పాత్ర పోషించాడు.
అయితే సాధారణంగా భారత గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన వారికి నగదు బహుమతి, లేదా చెక్కులు ఇస్తుంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇంగ్లాండ్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న వారికి ఇంగ్లాండ్ లో సాంప్రదాయం ప్రకారం వైన్ బాటిల్స్, లేదా షాంపేన్ ను బహుమతిగా ఇస్తారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో ఒకసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు తో పాటు రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు భారత కెప్టెన్ గిల్.
దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు రెండు ఖరీదైన వైన్ బాటిల్స్ లభించాయి. వీటిలో ఒకటి నలుపు రంగులో ఉండే చాపెల్ డౌన్ బ్రట్ స్పార్క్లింగ్ వైన్. దీని విలువ దాదాపు 14 వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ వైన్ ఇంగ్లాండ్ లో ఎంతో ఫేమస్. ఇక ఈ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గిల్ కి.. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మేక్ కలమ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపిక చేశాడు. మరోవైపు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గిల్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఓ యంగ్ కెప్టెన్ ఇంత ఒత్తిడిలో కూడా అద్భుత ప్రదర్శన కనబరిచడం చాలా గొప్ప విషయం అన్నారు గౌతమ్ గంభీర్.
Also Read: IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా
ఇక ఈ సిరీస్ తో గిల్ కి ఒక గొప్ప భవిష్యత్తు ఉండబోతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్ గా గిల్ ఇంత బాగా బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కానీ ఐపీఎల్ సమయంలో తన బలహీనతలను బలంగా మార్చుకొని ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు గిల్. అలాగే ఈ సిరీస్ లో బౌలింగ్ యూనిట్ ను వినియోగించడంలో గిల్ మార్క్ కనిపించింది. మరి రానున్న రోజుల్లో గిల్ తన మార్క్ ఎలా చూపుతాడో వేచి చూడాలి.
?utm_source=ig_web_copy_link