Lion Viral Video: ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. లైకులు, కామెంట్స్ కోసం రిస్కీ ప్రయత్నాలు చేస్తున్నారు. డేంజరస్ స్టంట్స్ తో కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాములు, సింహాలు, పులులతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించడం, వాటిని దగ్గరికి వెళ్లి ఫోటోలు తీయడం లాంటి పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సింహాన్ని వీడియో తీస్తూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాలోని బాంబోర్ గ్రామంలో తాజాగా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలు ఓ యువకు క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. సాధారనంగా ఓ యువకుడు గిర్ నేషనల్ పార్క్ సమీపంలో సింహం దగ్గరికి వెళ్లి ఓ వీడియో తీయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ సింహం వేటాడిన జంతువును తింటూ ఉంది. అదే సమయంలో సదరు యువకుడు మొబైల్ తో దానిని షూట్ చేస్తూ దగ్గిరికి వెళ్లాడు. అదే సమయంలో సింహం కోపంతో గర్జించింది. అతడి వైపు వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. వెనుక ఉన్న జనాలు గట్టిగా అరవడంతో సింహం కాస్త వెనక్కి తగ్గింది. సదరు యువకుడు సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్లీ తను వేటాడిన జంతువును తినడం మొదలు పెట్టింది.
In Bhavnagar, Gujarat, a young man approached a lion eating its prey to take photos
pic.twitter.com/hBk59pdfUI— Ghar Ke Kalesh (@gharkekalesh) August 5, 2025
Read Also: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
తృటిలో ప్రాణాలతో బయటపడిన యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వీడియోలకు ఇలాంటి పనులు చేస్తారా? అంటూ మండిపడుతన్నారు. “లేచిన టైమ్ బాగుంది. సెకెన్ల కాలం ప్రాణాలతో బయటపడ్డావ్. లేదంటే, వేటాడిన జంవుతు ప్లేస్ లో నువ్వు ఉండేవాడివి” అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. “అబ్బా.. కాస్త ఉంటే సింహానికి డిన్నర్ అయ్యేవాడివి బాసూ” అంటూ మరో వ్యక్తి సటైర్ వేశాడు. “చిల్లర పనుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవడం మంచిది కాదు. మీరు పోతారు ఫర్వాలేదు. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న వారి పరిస్థితి ఏంటి? అనేది ఆలోచించండి” అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “ఇలాంటి ప్రమాదకర పనులు చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిని జైల్లో వేసి చిప్పకూడు తినిపిస్తేనే మిగతావారిలో భయం ఉంటుంది. మళ్లీ ఇలాంటి పనులు చేయరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ఏంటి.. AI వల్ల అలా జరుగుతుందా? భయపెడుతోన్న బాబా వంగా జ్యోతిష్యం!