Shivam Dube: ఈ యంగ్ క్రికెటర్ దారితప్పి క్రికెట్ వైపు అడుగులు వేశాడేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే అతడు ఓ ఆరడుగుల బుల్లెట్. సినీ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్లామర్ అతడిది. 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తాడు. అలవోకగా భారీ షాట్లను కొట్టేయగలడు. అతడే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శివమ్ దూబే {Shivam Dube}.
ఇతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సహచరులకు భరోసా ఇచ్చేలా ఆడేస్తాడు. ఇతడు 2024 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. 2019 నవంబర్ లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ-20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు టీమ్ ఇండియా తరపున 33 టీ-20 లు ఆడి.. 29.86 సగటుతో 448 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ధూబే 11 వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే భారత్ తరపున నాలుగు వన్డేలు కూడా ఆడి 43 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక దూబే వ్యక్తిగత జీవితం విషయానికి వెళ్తే.. 31 ఏళ్ల దూబేకు 2021 జూలై 16న అంజుమ్ ఖాన్ తో వివాహం జరిగింది. వీరికి 2022 ఫిబ్రవరి 13న బాబు జన్మించాడు. ఇక తాజాగా ఇతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. దూబే ఇటీవల భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.
దూబే తాజాగా రెండు అపార్ట్మెంట్ లు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఇతడి ఆస్తులు దాదాపు రూ. 50 కోట్లు ఉంటాయని సమాచారం. కుటుంబ పరంగా వచ్చిన ఆస్తులతో పాటు క్రికెటర్ గా దూబే కొన్ని ఆస్తులను కూడాబెట్టాడు. వాణిజ్య ప్రకటనలతో పాటు క్రికెట్ ఫీజుల రూపంలో అందుకున్న డబ్బులను వృధా చేయకుండా ఆస్తులు కొంటున్నాడు. ఇతడు తాజాగా ముంబై వెస్ట్ అందేరీలోని ఒషివరాలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటి కోసం రూ. 27.50 కోట్లు ఖర్చు చేశాడట.
Also Read: Yash Dayal: RCB దయాల్ ఇంత కామాంధుడా.. ఒక్కరు కాదు మరో ముగ్గురు అమ్మాయిల జీవితం నాశనం చేశాడు!
డిఎల్హెచ్ ఎంక్లేవ్ లోని ఈ అపార్ట్మెంట్స్ సైజ్ 4,200 స్క్వేర్ ఫీట్ అని, బాల్కనీతో కలుపుకొని 9,603 చదరపు అడుగులు ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్ తో పాటు మూడు పార్కింగ్ స్పేస్ లను దుబే కొనుగోలు చేశాడని సమాచారం. వీటి కొనుగోలుకు మొత్తం రూ 1.65 కోట్లు ఖర్చు చేసినట్లు రియాల్టర్ల సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు దూబేకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన దుబే.. అంతగా రాణించలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన దూబే.. 132.22 తో 357 పరుగులు నమోదు చేశాడు.
https://www.facebook.com/share/p/1HKcPJWyGW/