BigTV English

Rohit Sharma: రోహిత్ శర్మ.. చెన్నై కెప్టెన్ గా వెళుతున్నాడా?

Rohit Sharma: రోహిత్ శర్మ.. చెన్నై కెప్టెన్ గా వెళుతున్నాడా?

Will Rohit Sharma going to be the captain of Chennai Super King: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై.. ఇప్పుడు చాలా ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఎవరికి తను దొరుకుతాడనే దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే రకరకాల పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. నిజానికి తను ముంబయి నుంచి బయటకు వచ్చేస్తున్నాడా? అనే అంశంపై స్పష్టత లేదు. అంత అవమానం జరిగింతర్వాత ఎవడుంటాడు? అని కొందరు వ్యాక్యానిస్తున్నారు.


రైట్ టు మ్యాచ్ నిబంధన కింద రోహిత్ శర్మను చైన్నై సూపర్ కింగ్స్ తీసుకుని సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందని అంటున్నారు. మరి ధోనీ అందుకు అంగీకరిస్తాడా? అనేది తెలీదు. అందుకనేనా ధోనిపై రోహిత్ శర్మ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించాడని కొందరంటున్నారు.

ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో వరుసగా 3 వికెట్లు పడిపోయాయి. ఆ సమయంలో ధోనీని పంపించి ఉంటే మ్యాచ్ గెలిచేవారమని రోహిత్ అన్నాడు. అప్పుడు కొహ్లీ కెప్టెన్ గా , రవిశాస్త్రి కోచ్ గా ఉన్నారు. వీరిద్దరూ తీసుకున్న నిర్ణయమే కొంప ముంచిందని అన్నాడు.


Also Read: యూఎస్ ఓపెన్ 2024, జకోవిచ్ శుభారంభం..

ఏడో నెంబర్ బ్యాటర్ గా వచ్చిన ధోనీ హాఫ్ సెంచరీ చేసి, చివర్లో రన్ అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ ఓటమి పాలైంది. అదే సమయంలో నేను కెప్టెన్ గా ఉండుంటే, కచ్చితంగా ధోనీని పంపేవాడినని అన్నాడు. ఏదేమైనా వన్డే జట్టులో 4వ నెంబర్ బ్యాటర్ చాలా కీలకమని అన్నాడు. నాడు సెమీఫైనల్ లో ఆ ప్లేస్ కి సరైన ప్లేయర్ లేకుండానే ఆడామని అన్నాడు.

ఆ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 5 సెంచరీలు చేశాడు. 648 పరుగులు చేశాడు. ఆనాటి సంఘటన నేడెందుకు రోహిత్ రీవిల్ చేశాడని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. మొత్తానికి చెన్నైకి వెళ్లేందుకు..ధోనీకి గాలం వేసేందుకు చూస్తున్నాడని కొందరు అంటున్నారు. రోహిత్ శర్మకి అంత ఖర్మేమీ పట్టలేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మిగిలిన ఫ్రాంచైజీలు కూడా రోహిత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే తన రేట్ ను బట్టి, ఎవరు ముందుకు వస్తారనేది తేలిపోతుందని కొందరు అంటున్నారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×