BigTV English

Alcaraz Beat Humbert: క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్.. అతి కష్టంమీద

Alcaraz Beat Humbert: క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాస్.. అతి కష్టంమీద

Alcaraz Beat Humbert: వింబుల్డన్ టోర్నమెంట్‌లో రసవత్తరంగా సాగుతోంది. టాప్ సీట్ ఆటగాళ్లకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్. ఫ్రెంచ్‌ ఆటగాడు హాంబర్ట్‌పై చెమటోడ్చి నెగ్గాడు.


ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్- ఫ్రెంచ్ ప్లేయర్ హాంబర్ట్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. తొలుత ప్రత్యర్థులపై పైచేయి సాధించిన అల్కరాస్, తర్వాత నిరాశలో కూరుకుపోయాడు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లు బెస్ట్ ఆఫ్ ఫైవ్ కావడంతో కాస్త ఫిట్‌నెస్ సమస్య కూడా ఈ ఆటగాడ్ని వెంటాడింది.

కాకపోతే అల్కరాస్‌లో టెన్నిస్ అభిమానులు మెచ్చుకునే గుణం ఒకటి ఉంది. చివరివరకు పోరాటం చేయడమే. అదే అల్కరాస్‌కు కలిసొచ్చింది. టోర్నీ మొదలు నుంచి ఇప్పటి వరకు అల్కరాస్ ఆడిన తీరు గమనిస్తే ఇట్టే అర్థమవుతోంది. స్పెయిన్ ఆటగాడు అల్కరాస్-ఫ్రెంచ్ ప్లేయర్ హాంబర్ట్  ఇద్దరూ ఆది నుంచి కొదమసింహాల మాదిరిగా తలపడ్డారు. ఎవరి సర్వీసులో వాళ్లు సెట్స్ గెలుచుకున్నారు.


ఇద్దరు స్కోర్ సమం తర్వాత అల్కరాస్ దూకుడు ముందు ప్రత్యర్థి నిలవలేకపోయాడు. చివరకు నాలుగు సెట్లను 6-3, 6-4, 1-6, 7-5 తేడాతో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తొలి రెండు సెట్లు అతి కష్టంమీద గెలుచుకున్న అల్కరాస్, మూడో సెట్ లో మాత్రం ఊహించని పరాభవం ఎదురైంది. ఇక అల్కరాస్ పనైపోయిందని అనుకున్నారు. నాలుగో సెట్‌లో ఫస్టాప్ అంతా హాంబర్ట్‌దే పైచేయి అయ్యింది.

ALSO READ:  రెండో టీ20లో భారత్ ఘన విజయం..

ఈ క్రమంలో హాంబర్ట్ అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు ఒకటీరెండు కాదు..ప్రతి బాల్‌ను నెట్‌కు కొట్టడంతో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చు కున్నాడు అల్కరాస్. చివరకు ప్రత్యర్థిపై పైచేయి సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మొత్తానికి అల్కరాస్ ఆడుతున్న మ్యాచ్‌లు అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

 

Tags

Related News

Rinku Singh: పాపం రింకూ… తన బ్యాట్ కు రాఖీ కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడుగా

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×