BigTV English

Djokovic angry on Audience: వింబుల్డన్.. ప్రేక్షకులపై జకోవిచ్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Djokovic angry on Audience: వింబుల్డన్.. ప్రేక్షకులపై జకోవిచ్ ఆగ్రహం, అసలేం జరిగింది?

Djokovic angry on Audience: వింబుల్డన్‌లో విచిత్రమైన సన్నివేశం చోటు చేసుకుంది. ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ప్రేక్షకులపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అగౌరవపరిచిన ప్రేక్షకులకు గుడ్ నైట్ అంటూ సాగదీసి ఎగతాళి చేశాడు.


జకోవిచ్ ఆగ్రహం వెనుక అసలేం జరిగింది? సోమవారం సాయంత్రం నాలుగో రౌండ్‌లో జకోవిచ్- హోల్డర్ రూనీపై సునాయాశంగా గెలిచాడు. వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. దీని ద్వారా గ్రాండ్ స్లామ్ చరిత్రలో 60వ సారి క్వార్టర్స్‌లోకి ప్రవేశించి రికార్డు క్రియేట్ చేశాడు.

మ్యాచ్ అనంతరం మైదానంలో మాట్లాడిన జకోవిచ్, కొందరు ప్రేక్షకుల తీరుపై కాసింత ఆగ్రహం వ్యక్తంచేశాడు. రాత్రి వరకు ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఓ ఆటగాడి విషయంలో తనను అగౌరవపరిచిన ప్రేక్షకులకు తనదైన శైలిలో గుడ్ నైట్ చెప్పాడు. ప్రత్యర్థి రూనీ పేరు సాగదీసి పలుకుతూ ఉత్సాహరించిన ఆయన అభిమానులకు అదే రీతిలో బదులిచ్చాడు.


ఈలోగా టీవీ వ్యాఖ్యాత జోక్యం చేసుకున్నాడు. ప్రేక్షకులు ఎవరూ ఎగతాళి చేయలేదని, రూనీ మద్దతుగా గట్టిగా అరిచారని వివరించే ప్రయత్నం చేశాడు. ఆయన మాటలను జకోవిచ్ అంగీకరించలేదు. వాళ్లు ముమ్మాటికీ తననే ఎగతాళి చేశారన్నాడు. తాను రెండు దశాబ్దాలుగా ఈ టోర్నీకి వస్తున్నానని, ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసన్నాడు.

టెన్నిస్‌ను ప్రేమించి టికెట్ కొనుక్కొని ఇక్కడకు వచ్చినవారిపై తాను దృష్టి పెడతానన్నాడు జకోవిచ్. ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో మ్యాచ్‌లు ఆడిన సందర్భాన్ని గుర్తు చేశాడాయన. ఇంతకంటే మీరు తనను ఏమీ చేయలేరని, ఎగతాళి చేసినవారిపై చురకలు వేశాడు.

ALSO READ: విరాట్ కోహ్లికి చెందిన పబ్ పై కేసు నమోదు.. బెంగళూరులో ఎఫ్ఐఆర్

ఇదే వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు జకోవిచ్. తాను నిజమైన అభిమానులను గౌరవిస్తానని, ఎవరైనా హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం స్పందిస్తానన్నాడు. ఈ విషయంలో వింబుల్డన్ నిర్వాహకులను తప్పుపట్టలేమని, తప్పుగా వ్యవహరిస్తున్న ఓ గుంపును బయటకు తరలించడం సాధ్యంకాదన్నాడు. టెన్నిస్‌లో ఆటగాళ్లను నిరాశ పరిచేందుకు ఇలాంటి జరుగుతాయని చెప్పకనే చెప్పేశాడు. ఆ తరహా ఘటనపై రాబోయే రోజుల్లో నిర్వాహకులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

 

Tags

Related News

Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే… రషీద్ ఖాన్ కు కెప్టెన్సీ

BCCI : సెలెక్టర్లను ఎలా బీసీసీఐ ఎంచుకుటుంది.. ఉండాల్సిన అర్హతలు ఏంటి

APL 2025: APL-2025 విజేతగా తుంగభద్ర వారియర్స్… పుష్ప రేంజ్ లో సెలబ్రేషన్స్… ప్రైజ్ మనీ ఎంత అంటే

Faheem Ashraf : మా ఆకలి తీరింది… పాకిస్తాన్ క్రికెటర్ వివాదాస్పద పోస్ట్… గందరగోళంలో ఆసియా కప్

Sachin Tendulkar: ఖరీదైన ఫ్లాట్ కొన్న సచిన్… కొడుకు అర్జున్ వేరు కాపురం పెట్టనున్నాడా !

Sarfraz Khan : గే తో టీమిండియా యంగ్ క్రికెటర్ అ**క్రమ సంబంధం?

Big Stories

×