BigTV English

Djokovic Vs Alcaraz: వింబుల్డన్ ఫైనల్ విజేత ఎవరు..? జకోవిచ్ వర్సెస్ అల్కరాస్ ఢీ!

Djokovic Vs Alcaraz: వింబుల్డన్ ఫైనల్ విజేత ఎవరు..? జకోవిచ్ వర్సెస్ అల్కరాస్ ఢీ!

Djokovic Vs Alcaraz: వింబుల్డన్‌లో ఫైనల్ సమరానికి అంతా సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ కోసం సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్- స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ మధ్య టైటిల్ పోరు జరగనుంది.


ఆదివారం సాయంత్రం వింబుల్డన్‌లో ఆసక్తికర సమరం మొదలుకానుంది. రికార్డు టైటిల్‌పై కన్నేశారు సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడి గా నిలివాలని భావిస్తున్నాడు. మరి ఆ ఆటగాడి కల ఫలిస్తుందా? అంటే చెప్పడం కష్టమే. వయస్సు సమస్య ఒకటి కాగా, మరొకటి గాయాల కారణంగా గతనెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు జకోవిచ్.

మైదానంలో ప్రస్తుతం జకోవిచ్ ఆడుతున్నా, మునుపటి ఫామ్ మాత్రం కనిపించలేదు. ఇక వింబుల్డన్‌లో టోర్నీ మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు జకోవిచ్‌కు సరైన ప్రత్యర్థి కనెక్ట్ కాలేదు. కొంతమంది ఆటగాళ్లు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయంది. బలమైన ప్రత్యర్థి అల్కరాస్ ముందు జకోవిచ్ నిలబడతాడా..? అన్నదే అసలు ప్రశ్న. జకోవిచ్‌కు ఇది 10వ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్. ఏడు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్ 8సార్లు వింబుల్డన్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు.


Also Read: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ

క్లో కోర్టు కింగ్ ఛాంపియన్ రఫెల్‌నాదల్ వారసుడిగా స్పెయిన్ నుంచి టెన్నిస్‌లోకి అడుగుపెట్టారు కార్లోస్ అల్కరాస్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడాయన. గతేడాది ఫైనల్‌లో జకోవిచ్ చిత్తు చేసి టైటిల్ ఎగురేసుకుపోయాడు అల్కరాస్. 21 ఏళ్లకే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను అందుకున్న చరిత్ర ఈ యువ ప్లేయర్‌ది.

వింబుల్డన్ టోర్నీలో బలమైన ప్రత్యర్థులను ఓడించాడు అల్కరాస్. ఆయన ఆటతీరును చూసినవాళ్లు మాత్రం టెన్నిస్‌లో అల్కరాస్ శకం మొదలైందని అంటున్నారు. ముఖ్యంగా ఒక్క సెట్ పోయినా చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. చివరివరకు ప్రత్యర్థిపై పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ పోరాటమే ఇప్పుడు ఫైనల్‌కి తీసుకొచ్చిందని అంటున్నారు. ఇద్దరి ఆటగాళ్లలో టైటిల్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

Tags

Related News

MS Dhoni: అంబానీ భారీ స్కెచ్…ముంబై ఇండియ‌న్స్ జెర్సీలో MS ధోని…కెప్టెన్ గా ఛాన్స్ !

Dhanashree Verma: చాహల్ పెద్ద ఎద‌వా, ఛీట‌ర్…ధ‌న శ్రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Cummins – Travis Head : క‌మిన్స్‌, హెడ్ కు ఐపీఎల్ ఓన‌ర్‌ బంప‌ర్‌ ఆఫర్…చెరో రూ.58 కోట్లు

Rohit Sharma: గంభీర్ వ‌ల్ల ఒరిగిందేమీ లేదు, ద్రావిడ్ వ‌ల్లే ఛాంపియన్స్ ట్రోఫీ..ఇజ్జ‌త్ తీసిన రోహిత్ శ‌ర్మ

Yograj Singh: సిరాజ్‌ ప్ర‌మాద‌క‌ర‌మైన ఆల్ రౌండ‌ర్ అవుతాడు, కూర్చుని సిక్సులు కొట్టే వీరుడు

Aus vs Pak Women: ఆస్ట్రేలియాతో బిగ్ ఫైట్..ఓడితే పాకిస్థాన్ ఇంటికేనా

Prithvi Shaw: ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకుని, బ్యాట్ తో కొట్టిన పృథ్వీ షా

Eng vs Ban Women: బంగ్లాపై ఇంగ్లాండ్ గ్రాండ్ విక్ట‌రీ..పాయింట్ల‌ ప‌ట్టిక‌లో దిగ‌జారిన టీమిండియా

Big Stories

×