BigTV English
Advertisement

Chiru 157 : అనిల్ రావిపూడి యూనివర్స్… చిరు సినిమాలో ఆ స్టార్ హీరో ఫిక్స్ అయిపోయాడు..?

Chiru 157 : అనిల్ రావిపూడి యూనివర్స్… చిరు సినిమాలో ఆ స్టార్ హీరో ఫిక్స్ అయిపోయాడు..?

Chiru 157  : రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్న సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ హీరో ఎవరు? అనిల్ రావిపూడి ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైలర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలోనే షూటింగ్ షురూ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలకపాత్రను పోషించబోతున్నట్టు తెలుస్తోంది.


నిజానికి చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి బాండింగ్ ఉంది. అదే ఫ్రెండ్షిప్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇటు వెంకటేష్, అనిల్ రావిపూడికి కూడా మంచి అనుబంధం ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ ఓ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో చిందేయబోతున్నాడని అంటున్నారు. అలాగే ఓ ఫైట్ సీన్ లో గెస్ట్ గా వెంకటేష్ నటిస్తాడని సమాచారం.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో లింక్

ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి తన హిట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో చిరంజీవి సినిమాను కనెక్ట్ చేయబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాలో హీరో పేరు శివ శంకర వర ప్రసాద్ అని అనిల్ రావిపూడి వెల్లడించారు. నిజానికి చిరంజీవి అసలు పేరు కూడా అదే కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో చిరు రా ఏజెంట్ గా నటిస్తాడని టాక్ నడుస్తోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో హీరో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోతారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలకు లింక్ అయ్యేలా అనిల్ ‘మెగా 157’ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని, చిరు వెంకటేష్ లను ఒకే తెరపై చూపించి అనిల్ రావిపూడి యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ “వింటుంటే ఏం కిక్కు ఉంది మావా” అంటూ అటు మెగా అభిమానులు, ఇటు వెంకీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అనిల్ రావిపూడి ఒరిజినల్ ప్లాన్ ఏంటో ఆయనకే తెలియాలి. ఇప్పటికే ఆయన వరుస అప్డేట్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×