Big Stories

New Credit Card Rules by RBI: క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చిన RBI.. యూజర్లకు లాభమా..? నష్టమా..?

- Advertisement -

New Credit Card Rules by RBI: క్రెడిట్ కార్డు వాడని వారుండరు. ఉద్యోగులు, వ్యాపారులు, చిరు వ్యాపారస్తులు ఇలా అందరూ క్రెడిట్ కార్డు వాడేందుకు అలవాటుపడ్డారు. అవసరానికి డబ్బు కావాలంటే.. బయట అప్పు చేసేకంటే.. క్రెడిట్ కార్డులో స్వైప్ చేసి తీసుకోవచ్చు. అవసరం తీరాక అదే క్రెడిట్ కార్డును స్వైప్ చేసి తిరిగి చెల్లించవచ్చు. ఇలా క్రెడిట్ కార్డులతో ఒక రీ సైక్లింగ్ చెల్లింపులు చేసుకోవచ్చు. కార్డు స్వైప్ చేసినా, బిల్లులు చెల్లించినా.. ఆ రోజు నుంచి 45 రోజులపాటు చెల్లింపులకు గడువు ఉంటుంది. కాగా.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను మార్చింది. ఈ మార్పుల ద్వారా కస్టమర్లకు కాస్త ఉపశమనం కలుగుతుంది.

- Advertisement -

క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఇప్పుడు వారి సౌకర్యానికి తగ్గట్లుగా కార్డు బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకోవచ్చు. గతంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఒకసారి మాత్రమే దీన్ని మార్చేందుకు అవకాశం కల్పించేవి. అయితే ఈ పరిమితిని తొలగించాలని RBI కోరింది. సెంట్రల్ బ్యాంక్ ఇటీవల ఈ నిబంధనను అమలు చేసింది.

మార్పులు ఎలా చేయాలో తెలుసా ?

ముందుగా అన్నింటిలో మునుపటి బకాయి మొత్తాన్ని చెల్లించాలి.

తర్వాత.. క్రెడిట్ కార్డ్ కంపెనీ ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా బిల్లింగ్ సైకిల్‌లో మార్పు కోసం రిక్వెస్ట్ చేయాలి.

కొన్ని బ్యాంకుల్లో మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ మార్పులను చేయవచ్చు.

Also Read: Alert for SBI Users : SBI వినియోగదారులకు షాక్.. డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు..

దీని వల్ల క్రెడిట్ కార్డుదారులకు లాభమేంటి ?

కస్టమర్లు తమ సౌకర్యం, తగినంత నగదు ప్రకారం బిల్లు చెల్లింపు తేదీని నిర్ణయించవచ్చు.

మీరు క్రెడిట్ కార్డ్‌లలో వడ్డీ రహిత వ్యవధిని గరిష్టంగా పెంచుకోవచ్చు.

మీరు ఒకే తేదీన వేర్వేరు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

బిల్లింగ్ సైకిల్ అంటే ఏమిటి?

కస్టమర్ మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లు (Credit Card Statement) ప్రతి నెల 6వ తేదీన వస్తుందనుకుందాం. కార్డు బిల్లింగ్ సైకిల్ ఆ నెల 7వ తేదీ నుండి మొదలై తర్వాతి నెల 6వ తేదీతో ముగుస్తుంది.

ఈ 30 రోజుల వ్యవధిలో చేసిన అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలు క్రెడిట్ కార్డ్ బిల్లులో కనిపిస్తాయి. ఇందులో అన్ని కార్డ్ చెల్లింపులు, నగదు ఉపసంహరణలు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల గురించిన సమాచారం ఉంటుంది. టైప్ ఆఫ్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ ఆధారంగా.. ఈ బిల్లింగ్ వ్యవధి 27 రోజుల నుండి 31 రోజుల వరకు ఉంటుంది.

కస్టమర్‌లు ఎలా ప్రభావితమవుతారు?

ఇప్పటి వరకూ కస్టమర్‌కు జారీ చేసిన క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ సైకిల్‌ను క్రెడిట్ కార్డ్ కంపెనీలు మాత్రమే నిర్ణయించేవి. దీని కారణంగా చాలా సార్లు కస్టమర్‌లు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే RBI కొత్త నిబంధనలను జారీ చేసిన తర్వాత.. కస్టమర్‌లు తమ కోరిక మేరకు ఒకటి కంటే ఎక్కువసార్లు క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్/పీరియడ్‌ని మార్చుకోవచ్చు.

Also Read: Bank Holidays : అమ్మో.. ఏప్రిల్ లో బ్యాంకులకు ఇన్ని సెలవులా ? మీ పనులు చకచకా కానివ్వండి..
కనీస బ్యాలెన్స్ చెల్లించడం మానుకోండి

బ్యాంకులు బిల్లు మొత్తం బకాయి చెల్లించే బదులు కనీస చెల్లింపు చేసే అవకాశాన్ని కూడా ఇస్తాయి. కానీ వారు కస్టమర్‌లకు చెప్పనిదేమిటంటే, అలా చేయడం వలన ప్రస్తుత బిల్లింగ్ సైకిల్‌లో బకాయి ఉన్న మొత్తంపై వడ్డీ వసూలు చేయడమే కాకుండా.. తదుపరి బిల్లింగ్ సైకిల్స్‌లో చేసిన అన్ని ఇతర లావాదేవీలపై వడ్డీ రహిత వ్యవధి కూడా రద్దు చేయబడుతుంది.

దీని అర్థం గడువు తేదీ తర్వాత చేసిన అన్ని లావాదేవీలపై మొత్తం బకాయి పూర్తిగా చెల్లించేంత వరకు వడ్డీని వడ్డిస్తారు. దీన్ని నివారించాలంటే గడువు తేదీలోగా బిల్లును పూర్తిగా చెల్లించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

బిల్లు చెల్లింపు తేదీ మారుతుంది

ఒక కస్టమర్ తన బిల్లింగ్ సైకిల్‌ను మార్చుకుంటే.. అతని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు గడువు తేదీ కూడా మారుతుంది. ఈ గడువు తేదీ.. ప్రకటన తేదీ నుండి 15 నుండి 20 రోజులు ఉండవచ్చు.

దీని అర్థం కస్టమర్ 45 నుండి 50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని పొందుతాడు. ఇందులో 30 రోజుల బిల్లింగ్ సైకిల్, గడువు తేదీ వరకు 15-20 రోజులు ఉంటాయి. గడువులోగా చేసిన చెల్లింపులపై అదనపు ఛార్జీలు విధించబడవు. గడువు దాటినా, కనీస బ్యాలెన్స్ చెల్లింపులు చేసినా వడ్డీలు ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News