Womens Team India Scenarios: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 24 మ్యాచులు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో సెమీ ఫైనల్ పోరు ప్రారంభమవుతుంది. ఇలాంటి క్రమంలో టీమిండియాను మహిళలను దక్షిణాఫ్రికా జట్టు టెన్షన్ పెడుతోంది. నిన్న నెదర్లాండ్స్ పైన విజయం సాధించిన దక్షిణాఫ్రికా, సెమీ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారయింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో నిన్న నెదర్లాండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా (South Africa Women vs Netherlands Women) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో 88 పరుగుల తేడాతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా… టీమిండియాను టెన్షన్ పడుతోంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం గ్రూప్ A లో ఆస్ట్రేలియా దాదాపు సెమీ ఫైనల్ కు చేరినట్లే. ఇక టీమిండియా అలాగే దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య రెండో స్థానం కోసం పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఒకే జట్టు సెమీ ఫైనల్ కు వెళుతుంది. రెండు జట్లకు ఆరు పాయింట్లు ఉన్నాయి. కానీ టీమిండియా కు 2.26 రన్ రేట్ ఉండగా… దక్షిణాఫ్రికా ఖాతాలో 0.734 మాత్రమే ఉంది.
ఇలాంటి క్రమంలో టీమిండియా గ్రూప్ స్టేజీలో ఆస్ట్రేలియాతో ఆదివారం మ్యాచ్ ఆడనుంది. ఇందులో కచ్చితంగా టీమిండియా గెలవాలి. ఒకవేళ గెలవకపోతే, అదే రోజున బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవాలి. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయినప్పటికీ రన్ రేట్ ప్రకారం సెమీ ఫైనల్ కు చేరుతుంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయి, బంగ్లాదేశ్ పైన దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం మనోళ్లు ఇంటి దారి పట్టాల్సిందే. కాబట్టి ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే మ్యాచ్ టీం ఇండియాకు చాలా కీలకంగా మారనుంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును టి20లలో ఓడించడం చాలా కష్టమే. కానీ పకడ్బందీగా ప్లాన్ చేసి మరి… ఆస్ట్రేలియా క్రికెటర్లను ఓడించాలి. లేకపోతే టీమిండియా పరువు పోతుంది.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో టీమిండియా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడం లేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందాన మినహా ఎవరు రాణించడం లేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మిడిల్ ఆర్డర్ ను లీడ్ చేయడం లేదు. అటు జెమిమా టెస్ట్ మ్యాచ్ తరహాలో ఈ టి20లలో ఆడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును ఓడించాలంటే కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. మరి మనోళ్లు ఎలా ఆడతారో చూడాలి.