E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం
Advertisement

Hyderabad Rains: దేశవ్యాప్తంగా రుతుపవనాల జోరు కొనసాగుతోంది.  ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కుపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త రిలీఫ్. దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరుగా కదులుతున్నాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరు

Advertisement

నైరుతి రుతుపవనాలు పశ్చిమ, మధ్య ఉత్తర భారత్ అంతా విస్తరించాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు అక్కడక్కడ కురిసినప్పటికీ జూన్ 4 నుంచి ఇప్పటివరకు  దేశం 42 శాతం వర్షపాత లోటు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటికి 118.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది . దీంతో 42శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. కొద్దిరోజులుగా రుతుపవనాలు పుంజుకోవడంతో వర్షాలు పడుతున్నాయి.

Advertisement

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు

దేశంలోని కొన్ని ప్రాంతాలలో మేఘాలు విస్తరించినట్టు తెలిపింది. దాదాపు మూడు వారాల తర్వాత రుతుపవనాల జోరు మొదలైనట్టు అంచనా వేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లోపశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో 12 నుండి 20 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని ఐఎమ్‌డి పేర్కొంది.

దక్షిణాదిలో వానలు పడుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం కలిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

ALSO READ: పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ 

తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ, పశ్చిమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీ రాజధాని అమరావతిలోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. రాబోయే ఐదు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండబోవని పేర్కొంది.

వివిద ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. జూన్ 26-27 వరకు ఇదే విధంగా వాతావరణం కొనసాగనుంది. జూన్ 27-28 మధ్య అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది.

Related News

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

చిక్కడపల్లిలో దారుణం.. భార్యను రోకలిబండతో బాది చంపిన భర్త!

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

Big Stories

Advertisement
×