BigTV English

World Cup 2023 : అయ్యో.. ఏమిటిలా జరిగింది .. శ్రీలంక సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ

World Cup 2023 : అయ్యో.. ఏమిటిలా జరిగింది .. శ్రీలంక సభ్యత్వాన్ని రద్దు చేసిన ఐసీసీ

World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో సంచలనాలు లేవు. ఆఫ్గనిస్తాన్ విజయాలు , మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ తప్ప చెప్పుకోదగ్గవి లేవని అంతా అనుకున్నారు. అయితే ఐసీసీ ఎవరూహించని షాక్ ఇచ్చింది. శ్రీలంక విషయంలో అత్యంత కఠినంగా ఐసీసీ వ్యవహరించింది.


ప్రపంచకప్ లో అత్యంత ఘోర పరాజయాలతో పాయింట్ల టేబుల్ లో 9వ స్థానంలో నిలిచిన శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారి నివ్వెరపోయింది. శిక్ష వేయవచ్చు గానీ, మరీ ఇంత కఠినంగా ఉండకూడదని అంటున్నారు. ఐసీసీ అత్యుత్సాహం కూడా ఎక్కువైందని అప్పుడే నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆల్రడీ శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ దేశ క్రికెట్ బోర్డుని రద్దు చేసింది. దీంతో ఐసీసీ శాంతించాల్సిందని అంటున్నారు. లేదంటే  శ్రీలంక ఆటగాళ్లలో సగం మందికి ఉద్వాసన పలకడమో లేకపోతే మొత్తం జట్టుకి పనిష్మెంట్ ఇవ్వమని సలహా ఇచ్చి ఉండాల్సింది. అంతేకానీ ఇలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అంటున్నారు.


వరల్డ్ కప్ లో ఆడినవే 10 జట్లు. అందులో ఏదొకటి తప్పనిసరిగా అడుగుకి వెళుతుంది. అప్పటికి గుడ్డిలో మెల్లగా తొమ్మిదో స్థానంలోనే కదా ఉంది. దీనికెందుకు అంత పెద్ద శిక్ష అర్థం కావడం లేదని కొందరంటున్నారు. అయితే దీని వెనుక అయితే ఐసీసీ చెప్పిన కారణాలు మరొలా ఉన్నాయి.

అదేమిటంటే సభ్యత్వ దేశంగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ బాధ్యతలను విస్మరించిందని తెలిపింది. ముఖ్యంగా బోర్డు వ్యవహారాలను స్వయంప్రతిపత్తితో, ప్రభుత్వ జోక్యం లేకుండా నిర్వహించాలి. ఈ విషయంలో శ్రీలంక బోర్డు విఫలమైందని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. అయితే సస్పెన్షన్ షరతులను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. నవంబర్ 21న ఐసీసీ బోర్డు సమావేశంలో శ్రీలంక క్రికెట్ భవిష్యత్ ఏమిటన్నది తేలుతుందని అంటున్నారు.

ఇంత మెగా టోర్నీలో ఒక నాసిరకం జట్టుని పంపి, టోర్నమెంట్ కే ఆకర్షణ లేకుండా చేశారని కొందరంటున్నారు. రెండు బలమైన జట్లు పోరాడితేనే మజా వస్తుంది. అలాంటిది ఆడిన అన్ని మ్యాచులు వన్ సైడ్ అయిపోయాయి..అందుకే ఐసీసీ అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వన్డే ప్రపంచకప్ లో కేవలం 2 మ్యాచ్ ల్లోనే శ్రీలంక విజయం సాధించింది. తొమ్మిదిలో ఏడింట ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2025లో పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సైతం శ్రీలంక అర్హత సాధించలేకపోయింది.

మరోవైపు 2024 జనవరిలో జరిగే అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. దీంతో అండర్ -19 ప్రపంచకప్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. సస్పెన్షన్ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లలో శ్రీలంక పాల్గొనేందుకు అవకాశం ఉండదు. కానీ ఈ నిర్ణయం మిగిలిన జట్లకి ఒక పనిష్మెంట్ లాంటిదని కూడా అంటున్నారు. ఇతర దేశాల్లోని క్రికెట్ బోర్డులకి కూడా కనువిప్పు అంటున్నారు. ఇక నుంచి ఆటగాళ్లు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Related News

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Big Stories

×