BigTV English
Advertisement

IPL 2025 : SRH గెలుపు కోసం ఉప్పల్ స్టేడియంలో పూజలు

IPL 2025 : SRH గెలుపు కోసం ఉప్పల్ స్టేడియంలో పూజలు

IPL 2025 :  గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అలాగే రికార్డులను నమోదు చేస్తుందని అంతా భావించారు. తొలి మ్యాచ్ లో 285 పరుగులు చేసింది SRH. ఈ ఏడాది 300 పరుగులు దాటుతుందని అంతా భావించారు. కానీ సన్ రైజర్స్ జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ఆడినటువంటి మ్యాచ్ లలో ఒక మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ లన్నింటిలో ఓడిపోయింది.


దీంతో సన్ రైజర్స్ జట్టు పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. గతంలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ ప్రస్తుతం వీరి భాగస్వామ్యం అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. దీంతో జట్టు భారీ స్కోర్ చేయడంలో వెనుకంజలో ఉంది. గతంలో భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కానీ ఈ సారి సన్ రైజర్స్ జట్టు భువనేశ్వర్ కుమార్ ని తీసుకోలేదు. దీంతో బెంగళూరు జట్టు బౌలింగ్ లో ముందంజలో ఉంది.

 


ఇప్పటివరకు హైదరాబాద్ ఐదు మ్యాచ్ లు ఆడితే.. కేవలం ఒక  మ్యాచ్ లోనే విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయి అభిమానులను నిరాశకు గురి చేసింది.  పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరన ఉంది SRH. ఇకపైన ప్రతి మ్యాచ్ హైదరాబాద్ గెలవాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటికి అన్నట్లు ఉంది పరిస్థితి.  అందుకే హైదరాబాద్ గెలవాలని ఉప్పల్ స్టేడియంలో పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ ఆటగాళ్ల ఆటను చూసి ఓనర్ కావ్య నిరాశ చెందుతున్నారు. మరో సందర్భంగా కాస్త చికాకుగా కూడా కనిపిస్తున్నారు.

SRH టీమ్ ఇటీవల హైదరాబాద్ నగరంలోని పెద్దమ్మగుడి టెంపుల్ ను కూడా దర్శించుకున్నారు. అయినప్పటికీ మ్యాచ్ ఫలితం మారలేదు. ఓడిపోయారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆశీస్సులు తీసుకున్నారు. తప్పకుండా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో కూడా విఫలం చెందింది. హైదరాబాద్ టీమ్ లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ విజయం సాధించేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా సొంత గడ్డ పై కూడా విజయం సాధించాలంటే నానా తంటాలు పడుతోంది SRH. ఈ సీజన్ లో వరసగా నాలుగో ఓటమిని చవి చూసింది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 06వ తేదీన గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కి ప్లే ఆప్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో రెండు లేదా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోతే ఈ జట్టు ప్లే ఆప్స్ ఆశలను వదులుకోవాల్సిందే. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ రెండింటిలో హైదరాబాద్ జట్టు పుంజుకున్నప్పుడే విజయాలు అందుకుంటారు. రెండిటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఈ సారి ప్లే ఆప్స్ కి కూడా చేరకుండా ఇంటికెళ్లే అవకాశం ఉంది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Balakrishna Palla (@balakrishnapalla1)

 

Related News

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Big Stories

×