HCU : కంచ గచ్చిబౌలి భూములు వివాదంలో రోజుకో టర్న్. నిజాలు నింపాదిగా బయటకు వస్తున్నాయి. ఫేక్ గాళ్లు అడ్డంగా దొరికిపోతున్నారు. ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోల బండారం బయటపడుతోంది. మొదట్లో ఫేక్ ప్రచారంతో విపక్షాలు ప్రభుత్వాన్ని బాగా బద్నామ్ చేశాయి. కాస్త తేరుకున్నాక.. రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది సర్కారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డినే రంగంలోకి దిగారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ను అలర్ట్ చేశారు. ఫేక్ కంటెంట్‌ను ఐడెంటిఫై చేసేలా స్పెషల్ టూల్స్ రెడీ చేయాలని ఆదేశించారు. అటు, తెలంగాణ హైకోర్టులోనూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు చూపిస్తూ ఏఐతో క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును కోరింది. ఇలా అన్నివైపుల నుంచి ఫేక్ గాళ్లకు ఉచ్చు బిగిస్తోంది తెలంగాణ సర్కార్.
ఫేక్ పోస్టులు డిలీట్..డిలీట్
ప్రభుత్వం పొగ బెట్టగానే.. ఇన్నాళ్లూ సోషల్ మీడియా ముసుగులో దాగున్న దొంగలంతా బయటపడుతున్నారు. దేశ భక్తులం, ప్రకృతి ప్రేమికులమంటూ.. HCU భూముల్లో నెమళ్లు, జింకలు చనిపోతున్నాయంటూ.. ఇప్పటి వరకూ పెట్టిన పోస్టులు వరుసగా డిలీట్ చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో వేలాది వీడియోలు సోషల్ మీడియా నుంచి మాయం అయ్యాయి. అంటే, తాము పెట్టిన కంటెంట్ ఫేక్ అని వాళ్లంతా ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఆ నెమళ్లు, జింకలకు కంచె గచ్చిబౌలి భూములకు సంబంధం లేదని తేలడంతో.. ఎందుకొచ్చిన కేసులంటూ తోక ముడుస్తున్నారు. అయితే, ఇలా పెట్టిన పోస్టులు డిలీట్ చేసిన వాళ్లలో కొందరు ప్రముఖులు కూడా ఉండటం విశేషం. రాజకీయంగా ఆసక్తికరం.
ఆ ఫోటో డిలీట్ చేసిన కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలుసుగా. ఆ 400 ఎకరాలపై మొదటి నుంచీ మెసేజ్‌లు ఇస్తున్నారు. ఆ భూములను ఉద్యానవనంగా మార్చాలని, నెమళ్లు, జింకలు ఉన్నాయంటూ పలు రకాల పోస్టులు, వీడియోలు, ఫోటోలు వదిలారు. ఇప్పుడు ఆయన కూడా నాలుక కరుచుకుంటున్నారు. అవన్నీ ఫేక్ అని తెలీడంతో.. చేతులు కాలబోతున్నాయని తెలిసి ముందే ఆకులు పట్టుకుంటున్నారు. కిషన్ రెడ్డి గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన.. బుల్డోజర్లు, జింకలు, నెమళ్లతో కూడిన ఏఐ ఫోటోను డిలీట్ చేశారు. స్వయంగా కేంద్రమంత్రే ఎలాంటి కన్ఫర్మేషన్, క్రాస్ చెక్ లేకుండా అలా ఫేక్ కంటెంట్ పబ్లిసిటీ చేయడం ఎంత వరకు కరెక్ట్? కిషన్‌రెడ్డి అనే కాదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం ఇదే అంశంపై ఇటీవల తాను పెట్టిన ఏఐ జనరేటెడ్ ఫోటోలు, వీడియోలను తొలగించారు. నిజాలు బయటకు వస్తున్నాయి.. తప్పుడు ట్వీట్లు మాయమవుతున్నాయి.. వాస్తవాలు వెలుగులోకి వస్తుండటంతో పరువు పోతుందని పోస్టులు డిలీట్ చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ లీడర్ సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
నిజాలు బయటికి వస్తున్నాయి..తప్పుడు ట్వీట్లు మాయమవుతున్నాయి.
సీన్ కట్ చేస్తే..తాను పెట్టిన ట్వీట్ డిలీట్ చేసిన కేంద్రమంత్రి @kishanreddybjp .
నాడు కంచ గచ్చిబౌలి విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఏఐ ఇమేజ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన బురద చల్లి విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్… pic.twitter.com/wFXKT3LnsL
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) April 7, 2025
Also Read : ఫేక్ ఫోటోలతో సెలబ్రిటీస్ ఫోటోలు.. నిజాలు తెలిసి హైరానా
అంతా బీఆర్ఎస్ డైరెక్షన్‌లోనే?
ఫేక్ పోస్టులపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌ను నడిపిస్తున్న కొణతం దిలీప్, మన్నె క్రిశాంక్‌లపై ఇప్పటికే కేసులు నమోదు చేసింది. ఫేక్ వీడియోలు, ఫోటోలు ప్రచారం చేసినందుకు ఏప్రిల్ 9, 10, 11న 3 రోజుల పాటు విచారణకు రావాలంటూ క్రిశాంక్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక క్రిశాంక వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేగా? కేటీఆర్ ఆదేశాలు లేకుండా దిలీప్ కానీ, క్రిశాంక్ కానీ.. అసలే పనీ చేయరని బీఆర్ఎస్ శ్రేణులే చెబుతున్నాయి. కేటీఆర్ డైరెక్షన్‌లోనే HCU భూములు, జింకలు, నెమళ్లతో ఫేక్ వీడియోలు, ఫోటోల తంతు నడిచిందనే అనుమానం ఉంది. క్రిశాంక్‌ను ప్రశ్నిస్తే అసలు సూత్రదారులు, వ్యూహకర్తలు ఎవరో బయటకు రావొచ్చిన పోలీసులు భావిస్తున్నారు.