BigTV English

Tilak Varma: తిలక్ ముంబైకి పట్టిన దరిద్రమా..?

Tilak Varma: తిలక్ ముంబైకి పట్టిన దరిద్రమా..?

Tilak Varma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా సోమవారం రోజు వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 12 పరుగులు తేడాతో పరాభవం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.


 

తిలక్ వర్మ హాఫ్ సెంచరీ తో రాణించినా ఓడిపోక తప్పలేదు. గత మ్యాచ్ లో లక్నో పై ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఆ మ్యాచ్ లో తిలక్ వర్మ “రిటైర్డ్ అవుట్” కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో మళ్ళీ ముంబై జట్టు మేనేజ్మెంట్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


దీనిపై హార్దిక్ పాండ్యా మళ్లీ స్పందించాడు. “ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ బాగా ఆడాడు. గత మ్యాచ్ లో ఎన్నో విషయాలు జరిగాయి. అవి బయట వ్యక్తులకు పెద్దగా తెలియవు. లక్నో మ్యాచ్ కి ముందు రోజు తిలక్ కి బంతి బలంగా తాకింది. రిటైర్డ్ అవుట్ గా ప్రకటించడం వెనక వ్యూహం ఉంది. కానీ తిలక్ వేలికి గాయమైంది నిజం. ఆ కారణంగానే అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. కోచ్ నిర్ణయం మేరకు తిలక్ ని వెనక్కి పిలిపించి.. కొత్త బ్యాటర్ తో ఎటాక్ చేయించాలన్నది మా ప్లాన్.

ఇక కోలుకున్న తిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా ఆడాడు” అని చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇక ఈ మ్యాచ్ లో 29 బంతులలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో తిలక్ వర్మ 56 పరుగులు చేశాడు. అయితే ఇక్కడే అసలు చర్చ మొదలైంది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేస్తే ముంబై జట్టు గెలిచిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. తిలక్ వర్మ ఐపిఎల్ లో హాఫ్ సెంచరీ చేస్తే.. ఏ మ్యాచ్ నీ కూడా ముంబై ఇండియన్స్ గెలవలేదు.

2022 ఐపీఎల్ నుండి 2025 ఐపీఎల్ వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇది నిజం. తిలక్ పోరాడిన ప్రతి మ్యాచ్ లోను ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. వాంఖడే స్టేడియంలో ఆర్సిబితో సోమవారం రోజు రాత్రి జరిగిన మ్యాచ్ లోను తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు ఐపీఎల్ లో తిలక్ వర్మ ఏడు ఆఫ్ సెంచరీలు చేశాడు.

 

ఈ సీజన్ లో ఆర్సిబి పై తొలి హాఫ్ సెంచరీ చేయగా.. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయింది ముంబై. 2022లో ఐపీఎల్ లో అడుగుపెట్టిన తిలక్ వర్మ ముంబై తరపున మాత్రమే ఆడుతున్నాడు. తొలి సీజన్ లో 397 పరుగులు చేసిన తిలక్.. 2023లో 343, 2024లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు {416} చేశాడు. తిలక్ వర్మ ఇప్పటివరకు చేజింగ్ లో ఏడుసార్లు హాఫ్ సెంచరీ చేయగా.. ముంబై ఒక్క మ్యాచ్ లోను గెలవలేదు. వీటిలో రెండేసి మ్యాచ్ లు ఆర్సిబి, రాజస్థాన్ రాయల్స్ పైనే ఓడిపోవడం గమనార్హం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×