E-Paper
Advertisement

Arjun Tendulkar Entry : వావ్.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ అదుర్స్.. తండ్రి తనయుడు ఐపీఎల్‌లో ఆడడం న భూతో న భవిష్యత్

Arjun Tendulkar Entry : వావ్.. అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ అదుర్స్.. తండ్రి తనయుడు ఐపీఎల్‌లో ఆడడం న భూతో న భవిష్యత్
Advertisement
Arjun Tendulkar Entry

Arjun Tendulkar Entry : తండ్రి కొడుకులు ఐపీఎల్‌లో ఆడడం ఎప్పుడైనా చూశామా. ఆ మాటకొస్తే ఏ ఫార్మాట్ క్రికెట్‌లోనూ జరగదు. కాని మాస్టర్ బ్లాస్టర్ విషయంలో జరిగింది. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు తనయుడు అర్జున్ టెండూల్కర్ అదే ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. ఇలా జరగడం క్రికెట్ హిస్టరీలోనే న భూతో న భవిష్యత్.

మొత్తానికి సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. మాస్టర్ బ్లాస్టర్ తనయుడిని ఫస్ట్ టైం ఐపీఎల్ గ్రౌండ్‌లో చూసే సరికి ఉబ్బితబ్బిబ్బయ్యారు. అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ప్లస్ బ్యాట్స్‌మెన్ కూడా. ఫస్ట్ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చి సెలెక్టర్స్ నమ్మకాన్ని నిలబెట్టాడు అర్జున్ టెండూల్కర్. కాకపోతే, అర్జున్‌తో రెండు ఓవర్లు మాత్రమే వేయించారు. 2 ఓవర్లకు 17 పరుగులు ఇచ్చాడు అర్జున్ టెండూల్కర్. ఇక బ్యాటింగ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు ఆడే అవకాశం రాలేదు.

Advertisement

హీరో కొడుకు అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వొచ్చు గాని.. స్పోర్ట్స్‌లో అంత ఈజీ కాదు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ కూడా చాలా కష్టంగా జరిగింది. ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వడానికి తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చింది. గతేడాది గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్.. సెంచరీ చేశాడు. ఇప్పటివరకూ 7 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, తొమ్మిది టీ20లు ఆడాడు. ఇంతకాలానికి కోల్‌కతాతో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు.

నిజానికి అర్జున్‌ను 2021లోనే ముంబై ఇండియన్స్ వేలంలో తీసుకుంది. కాని, ఆ మ్యాచ్‌లో ఆడించలేదు. బెంచ్‌కే పరిమితం చేసింది. 2022లోనూ అవకాశం దక్కలేదు. ఈ సీజన్‌లో గొప్ప అవకాశం దక్కింది. రోహిత్ శర్మ స్వయంగా ముంబై ఇండియన్స్ క్యాప్ అందించాడు. పైగా ఫస్ట్ ఓవర్ అర్జున్‌తోనే వేయించాడు ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ఉన్న సూర్య కుమార్ యాదవ్.

Related News

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Big Stories

Advertisement
×