BigTV English

WPL 2024 : ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ఫైనల్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్

WPL 2024 : ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ఫైనల్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్

ఫైనల్ లో...ఢిల్లీ క్యాపిటల్స్


WPL 2024 DC vs GG Highlights: ఉమన్స్ ప్రీమియర్ లీగ్ లో అమ్మాయిలు అదర గొడుతున్నారు. మగవారికన్నా తామేమీ తీసిపొమ్మన్నట్టు ఆడుతున్నారు. మొత్తానికి 2024 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్ గా నిలిచి ఫైనల్ కు దూసుకెళ్లింది. గుజరాత్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 6 విజయాలతో ముందడుగు వేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్ 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసింది. భారతీ ఫుల్మాలి (42) మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచింది. కేథరిన్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. లిచ్ ఫీల్డ్ (21) చేసింది. ఇక కెప్టెన్ దయాలన్ హేమలత 4 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లలో బెత్ మూనీ డక్ అవుట్ అయ్యింది. ఇలా చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల వద్ద జెయింట్ వీల్ తిరగడం ఆగిపోయింది.


Also Read: ఆ ఒక్కటీ లేకపోతే.. ఒకొక్కరికి రూ.100 కోట్లు: రాబిన్ ఉతప్ప

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మరజన్నే కాప్, శిఖా పాండే, మిన్ను మణి రెండేసి వికెట్లు తీశారు.. జెస్ జొనాస్సెన్ ఒక వికెట్ పడగొట్టింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. షెఫాలీ వర్మ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 37 బంతుల్లో 5 సిక్సులు, 7 ఫోర్లతో  71 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ అయితే (28 బంతుల్లో  38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.

గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వార్ (2/20) రెండు వికెట్లు తీసారు.

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా పైనల్ కు అర్హత సాధించింది. తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. ఇక్కడ గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×