అలా ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించిన శ్రేయాంక పాటిల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకవైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్భుతమైన ప్రదర్శన చేసిందని కితాబిస్తున్నారు.
ఇంతకీ తను బెంగళూరు అమ్మాయి. 21 ఏళ్ల శ్రేయాంక దేశివాళి క్రికెట్ లో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అక్కడ బాగా ఆడటంతో ఆమె భారత జట్టులోకి ఎంపికైంది. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది.
ఇప్పటివరకు భారత్ తరఫున రెండు వన్డేలు, 6 టీ 20లు ఆడిన శ్రేయాంకను ఆర్సీబీ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఫైనల్ మ్యాచ్ విన్నర్ తో ఇప్పుడు తన ధర అమాంతం పెరుగుతుందని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.
Also Read: ఆర్సీబీకి విజయ్ మాల్యా ట్వీట్.. బాయ్ ఫ్రెండ్ తో స్మృతి ఫోజ్..
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, శ్రేయాంక పటేల్ ను నాలుగు మ్యాచ్ ల తర్వాత ఆర్సీబీ పక్కన పెట్టింది. అప్పటికి తన ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంది. అయితే తర్వాత తన బదులు తీసుకున్నవారు శ్రేయాంక కన్నా ఘోరంగా ఆడుతుండటంతో విధిలేని పరిస్థితుల్లో మళ్లీ జట్టులో అవకాశం వచ్చింది. దీంతో దెబ్బతిన్న బెబ్బులిలా శ్రేయాంక విజృంభించింది.
ఓవరాల్ గా ఈ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడి 13 వికెట్లు పడగొట్టింది. పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంది. ఆ రెండు మ్యాచ్ లు కూడా ఆడి ఉంటే, బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. అలాగే ఉంచేస్తే, తన ఆటతీరు అలాగే ఉండేది, కసి, పట్టుదల వచ్చేది కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఏదేమైనా ఆర్సీబీ విజయంలో తన పాత్రను చిరస్మరణీయంగా మార్చుకుంది.