BigTV English
Advertisement

Brock Lesnar’s Daughter : బ్రోక్ లెస్నర్ కూతురితో ఎఫైర్… అల్లుడికి ఇక నరకమేనా ?

Brock Lesnar’s Daughter : బ్రోక్ లెస్నర్ కూతురితో ఎఫైర్… అల్లుడికి ఇక నరకమేనా ?

Brock Lesnar’s Daughter :  WWE లెజెండ్ బ్రాక్ లెస్నర్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను సౌత్ డకోటాలో జులై 12, 1977లో జన్మించాడు. 2000 సంవత్సరంలో ఇతను కుస్తీ మ్యాచ్ లు ఆడేందుకు శిక్షణ తీసుకున్నాడు. తన స్నేహితుడు పాల్ హేమన్ దగ్గర కుస్తీకి శిక్షణ తీసుకొని.. 2002 లో తన తొలి కుస్తీ మ్యాచ్ ఆడాడు.  అలా తన కెరీర్ కొనసాగింది. తాజాగా ఇతని కుమార్తె మయా లెస్నర్  మరో యువకుడితో ప్రేమలో పడిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడే కావాలని మొండి  పట్టు పట్టిందట. ఇందుకు సంబంధించి న్యూస్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకోవడం విశేషం.


డ్రైమోస్- మయా  బంధం బలమే.. 

శాన్ ప్రాన్సిస్కో రూకి (Drew Moss) డ్రూమోస్ తో తాను సంబంధం కొనసాగిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది బ్రాక్ లెస్నర్ కుమార్తె మయా లెస్నర్. ముఖ్యంగా “ఫరెవర్ వెడ్డింగ్ డేట్” అనే శీర్షికతో అందమైన ఫోటో తో పాటు హార్ట్ ఎమోజీ  ఫోటోను పోస్ట్ చేశాడు డ్రూమోస్.  లెస్నర్ అతడినీ “మై హ్యాండ్సమ్ మ్యాన్” అని రిప్లై ఇచ్చింది. అయితే కొంత కాలం వరకు మయా లెస్నర్ తన భాగస్వామి ఐడినీ బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంది. ఫోటోలు అన్నింటిని తన ఖాతా నుంచే పోస్టు చేయడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కళాశాల వెబ్ సైట్ కోసం తన ప్రేమికుడి గురించి వెల్లడించకుండా మాట్లాడింది. బ్రాక్ లెస్నర్ కుమార్తె తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అధికారికంగా వెల్లడించినప్పటికీ లెస్నర్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.


మిలటరీలో చేరాలనే కోరిక ఉంది : మియా లెస్నర్ 

వాస్తవానికి ఈ జంట కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థులుగా కలుసుకున్నారు. అక్కడ ఇద్దరూ తమ క్రీడలతో అత్యుత్తమ అథ్లెట్లుగా రాణించారు. డ్రూమోస్ ఫుట్ బాల్ ఆడాడు.  ఏప్రిల్‌లో 49ersతో సంతకం చేయడానికి ముందు 2025 NFL డ్రాఫ్ట్‌లో ఎంపిక కాలేదు.  అయితే మయా NCAAని గెలుచుకోవడం విశేషం. 23 ఏళ్ల వయస్సులోషాట్ ఫుట్, హ్యుమర్ త్రో, డిస్కస్ త్రో లలో రాణిస్తూ.. తన తండ్రి వారసత్వంగా పొందిన శక్తిని ప్రదర్శిస్తోంది మయా లెస్నర్. యూజీన్ లోని ప్రీఫోంటైన్ క్లాసిక్ డైమాండ్ లీగ్ లో జరిగిన తన చివరి సమావేశంలో 18.23 మీటర్ల త్రో చేసి 10వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ షిప్ ల విజేతలపై గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. టాలెంట్ ఉన్న క్రీడాకారిణి.. భవిష్యత్ ఒలింపియన్ గా కనిపించినప్పటికీ.. మియా ఒకసారి మిలిటరీలో చేరాలనే కోరికను వ్యక్తం చేసింది. దీనిని తన తన డ్రీమ్ జాబ్ అని పిలిచింది.  ఇక మయా లెస్నర్ కొలరాడో స్టేట్ లో ఆధిపత్య ట్రాక్ అండ్ ఫీల్డ్ రెజ్యూమేని నిర్మించారు. 2024లో NCAA ఇండోర్ షాట్ పుట్ జాతీయ టైటిల్ ను క్లెయిమ్ చేసింది. మౌంటైన్ వెస్ట్ ఫిమెల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె గ్లోబల్ సర్క్యూట్ లో చేరింది. మొత్తానికి లెస్నర్ కూతురు ప్రేమ వ్యవహారం పై అందరూ సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకోవడం విశేషం.

https://www.facebook.com/share/p/1Ba2m6Gzb2/


Related News

Rohit Sharma Weight: ఉద‌యం 3.30 లేస్తున్న రోహిత్‌.. మ‌రో 10 కిలోలు త‌గ్గేందుకు ప్లాన్

Rohit Sharma: రోహిత్ శర్మకు భయంకరమైన వ్యాధి.. అందుకే సెంచరీ తర్వాత కూడా హెల్మెట్ తీయలేదా ?

Shreyas Iyer Injury: విరిగిన శ్రేయాస్ అయ్యర్ పక్క బొక్కలు.. ఏడాది దాకా ఆడడం కష్టమే !

Brock Lesnar: బీఫ్ దుకాణం పెట్టుకున్న బ్రాక్ లెస్నర్… షాకింగ్ వీడియో ఇదిగో

Australian women cricketers: ఆస్ట్రేలియా మహిళల జట్టును గెలికిన వాడికి థర్డ్ డిగ్రీ.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.. నడవలేని పరిస్థితి

Rohit Sharma ODI Ranking: 38 ఏళ్లలో నం.1 ర్యాంక్.. గంభీర్ కాదు, వాడి అమ్మ మొగుడు కూడా రోహిత్‌ ను ఆపలేడు.. 2027 వరల్డ్ కప్ లోడింగ్

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ షెడ్యూల్ ఫిక్స్‌..టీమిండియా త‌ల‌ప‌డే జ‌ట్టు ఇదే..ఫ్రీగా చూడాలంటే

IND VS AUS: భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌..జ‌ట్లు, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Big Stories

×