E-Paper
Advertisement

Yashasvi Jaiswal : డ‘బుల్’.. యశస్వీ.. బద్ధలైన రికార్డ్స్..!

Yashasvi Jaiswal : డ‘బుల్’.. యశస్వీ.. బద్ధలైన రికార్డ్స్..!
Advertisement
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal Double Century IND vs ENG 3rd Test : టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ విశ్వరూపం చూపించి మరో డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో యశస్వి జైశ్వాల్ ఆట తీరుతో నభూతో నభవిష్యత్ అనిపించాడు.

మూడోరోజు ఆటలో సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగిన యశస్వి నాలుగో రోజు గిల్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చాడు. వచ్చీ రాగానే విజృంభించాడు. 236 బంతుల్లో 214 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అవేమిటో ఒకసారి చూద్దాం.

భారత్ తరఫున ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా యశస్వి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే మూడు టెస్టులు 6 ఇన్నింగుల్లో 545 పరుగులు చేసిన జైస్వాల్.. గంగూలీ చేసిన 534 రన్స్ రికార్డు బ్రేక్ చేశాడు.

Advertisement

అంతేకాదు, భారత్ తరఫున వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు  వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ ఇద్దరు  వరుసగా డబుల్ సెంచరీలు చేశారు. వినోద్ కాంబ్లీ ఇంగ్లండ్‌పై 224, జింబాబ్వే‌పై 227 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి శ్రీలంకపై వరుసగా 213, 243 పరుగులు చేశాడు.

ఒక సిరీస్ లో అయితే వినూ మన్కడ్, విరాట్ కొహ్లీ తర్వాత డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా జైశ్వాల్ రికార్డ్ సాధించాడు.

Advertisement

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక సిక్సర్లు (22) కొట్టిన రికార్డ్ తన సొంతమైంది.

1996లో వసీమ్ అక్రమ్ జింబాబ్వేపై 12 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు జైశ్వాల్ కూడా ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో  12 సిక్సర్లు కొట్టి వసీమ్ సరసన చేరాడు.

ఇవేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ జాబితాలో పటౌడీ, సర్దేశాయ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వసీమ్ జాఫర్ ఉన్నారు.

వీటితో పాటు మరికొన్ని, జైస్వాల్ ఖాతాలో చేరాయి. ఓ టెస్టులో ఇండియా సాధించిన అత్యధిక సిక్సర్లు రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి. మూడో టెస్టులో మన బ్యాటర్లు 48 సిక్సర్లు బాదారు.

ఇంతకుముందు సౌతాఫ్రికాపై సాధించిన 47 సిక్సర్లు అత్యధికంగా ఉండేవి. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (18) రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి.

మొత్తానికి యశస్వి బ్యాటింగుకి రికార్డులన్నీ చెల్లా చెదురయ్యాయి. మిగిలిన రెండు టెస్టుల్లో ఇంకెన్ని పరుగులు చేసి ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో వేచి చూడాల్సిందే. 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×