BigTV English

About Gulzar and Ramabhadracharya: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..

About Gulzar and Ramabhadracharya: జ్ఞాన్ పీఠ్ గ్రహీతలు గుల్జార్, రామభద్రాచార్యులు.. వారి జీవిత విశేషాలివే..

About Gulzar and Ramabhadracharya: ప్రముఖ ఉర్దూ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 ‘జ్ఞానపీఠ్‌’ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. శనివారం ఈ ప్రకటన విడుదల చేశారు.


ఉర్దూ కవిగుల్జార్‌..
హిందీ సినిమాల్లో గీత రచయితగా, స్ర్కీన్‌రైటర్‌గా, దర్శకుడిగా గుల్జార్‌ పనిచేస్తున్నారు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా, ప్రస్తుతం ఆయన వయసు 89. గుల్జార్‌ పలు పుస్తకాలు కూడా రాశారు. ప్రస్తుతం ఉన్న కవుల్లో ఉర్దూలో గొప్ప కవిగా పేరు సంపాధించుకున్నారు. ఆయన పలు అవార్డులను కూడా అందుకున్నారు.

2002లో సాహిత్య అకాడమీ,2004లో పద్మభూషణ్, 2013లో దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు చలనచిత్ర రంగంలో ఐదు జాతీయ అవార్డులు పొందారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ‘స్టమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలోని ‘జై హూ…’ పాటను గుల్జార్‌ ఆలపించారు. ఈ పాటు ఆస్కార్‌ను కూడా అందుకుంది ఉత్తమ స్కోర్‌ విభాగంలో.


Read More: మోదీ 3.0 ఖాయం.. అమిత్ షా విశ్వాసం..

పీఠాధిపతి రామభద్రాచార్యులు…
మధ్యప్రదేశ్‌ చిత్రకూట్‌లోని తులసీ పీఠం వ్యవస్థాపకులు రామభద్రాచార్య(74) ఆయనే తులసీ పీఠానికి పీఠాధిపతి. ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవాదిగా పేరుగాంచారు. ఆయన 22 భాషల్లో ప్రావీణ్యం పొందిన విద్యావేత్త. సంస్కృతం, హిందీ, అవధి, మైథిలీ సహా అనేక భారతీయ భాషల్లో రచనలు చేసి.. 240కు పైగా పుస్తకాలు రాశారు. పద్మవిభూషణ్‌ అవార్డును 2015లో అందుకున్నారు. భారతీయ సాహిత్యానికి ఆయన అందించిన విశిష్ట సేవలకుగాను ఇప్పుడు ‘జ్ఞానపీఠ్ అవార్డు’ను అందజేస్తూన్నారు.

‘జ్ఞానపీఠ్ అవార్డు’లను 1944లో ప్రారంభించారు. దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో జ్ఞానపీఠ్ ఒకటి. సంస్కృత భాషలోనే ఈ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి అయితే ఉర్దూ భాషాలో ఇది ఐదోసారి.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×